బాసరకు పాక్‌లో తప్పిపోయిన గీత
దిశ,వెబ్ డెస్క్: ‘డాటర్ ఆఫ్ ఇండియా’ గీత మంగళ వారం బాసరకు వచ్చారు. తన తల్లి దండ్రుల కోసం అన్వేషణ సాగిస్తున్న క్రమంలో ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్ వారి సహకారంతో ఆమె బాసరకు మంగళవారం చేరుకున్నారు. తాను చిన్నప్పుడు ఇడ్లీలు తినే వాళ్లమనీ… తమ సైడ్ వడ్లు ఎక్కువగా పండిస్తూ ఉండే వారని పౌండేషన్ సభ్యులకు ఆమె సైగలతో తెలిపింది. ఈ క్రమంలో ఆమెను ఫౌండేషన్ సభ్యులు బాసరకు తీసుకు వచ్చారు. వారు చెబుతున్న ఆనవాళ్ల […]
దిశ,వెబ్ డెస్క్: ‘డాటర్ ఆఫ్ ఇండియా’ గీత మంగళ వారం బాసరకు వచ్చారు. తన తల్లి దండ్రుల కోసం అన్వేషణ సాగిస్తున్న క్రమంలో ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్ వారి సహకారంతో ఆమె బాసరకు మంగళవారం చేరుకున్నారు. తాను చిన్నప్పుడు ఇడ్లీలు తినే వాళ్లమనీ… తమ సైడ్ వడ్లు ఎక్కువగా పండిస్తూ ఉండే వారని పౌండేషన్ సభ్యులకు ఆమె సైగలతో తెలిపింది. ఈ క్రమంలో ఆమెను ఫౌండేషన్ సభ్యులు బాసరకు తీసుకు వచ్చారు. వారు చెబుతున్న ఆనవాళ్ల ప్రకారం ఆమె తల్లి దండ్రుల కోసం ఫౌండేషన్ సభ్యులు వెతుకుతున్నారు.
కాగా బాల్యంలో గీత తప్పి పోయి పాకిస్థాన్ చేరుకుంది. అక్కడ ఈద్ ఫౌండేషన్ వారి సంరక్షణలో సుమారు 15 ఏండ్లు గడిపింది. ఆ తర్వాత అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహాయం చేయడంతో ఆమె భారత్ కు చేరుకున్నారు. అప్పటి నుంచి తన కుటుంబ సభ్యుల కోసం ఆమె వెతుకుతున్న సంగతి తెలిసిందే.