వార్నర్ లాగే.. కోచ్‌లపై వేటేస్తారా?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. 7 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలోనిలిచింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ యాజమాన్యం డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి కేన్ విలియమ్‌సన్‌కు బాధ్యతలు అప్పగించింది. ఎస్ఆర్‌హెచ్ నిర్ణయంపై పలు విమర్శలు చెలరేగాయి. తాజాగా మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ కూడా స్పందించారు. డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా విఫలమైతే అతడిని తొలగించి విలియమ్‌సన్‌కు ఇవ్వడంపై నాకేమీ అభ్యంతరం లేదు. […]
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. 7 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలోనిలిచింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ యాజమాన్యం డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి కేన్ విలియమ్‌సన్‌కు బాధ్యతలు అప్పగించింది. ఎస్ఆర్‌హెచ్ నిర్ణయంపై పలు విమర్శలు చెలరేగాయి. తాజాగా మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ కూడా స్పందించారు. డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా విఫలమైతే అతడిని తొలగించి విలియమ్‌సన్‌కు ఇవ్వడంపై నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అతడిని తుది జట్టులో నుంచి తీసి వేయడం మాత్రం ఆశ్చర్యపరిచిందని అన్నాడు.
డేవిడ్ వార్నర్ ఒక తిరుగులేని బ్యాట్స్‌మాన్.. అతడిని జట్టు నుంచి తప్పించి తప్పుచేశారన్నాడు. సీజన్ మధ్యలో కెప్టెన్‌ను మార్చినట్లు కోచ్‌లను కూడా తప్పిస్తారా అని ప్రశ్నించాడు. వాస్తవానికి ఫుట్ బాల్ వంటి ఆటల్లో జట్టు ఓటముల పాలవుతుంటే మొదట మేనేజర్‌ను తొలగిస్తారు.. మరి క్రికెట్‌లో అలా ఎందుకు చేయరని గవాస్కర్ అంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ వాయిదా పడటం వల్ల సన్‌రైజర్స్ యాజమాన్యానికి మంచి సమయం దొరికింది.. ఇప్పటికైనా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలసి గవాస్కర్ సూచించారు.