Gautam Gambhir: డ్రెస్సింగ్ రూం డిస్కషన్ లీక్.. ఆటగాళ్లకు కోచ్ గౌతమ్ గంభీర్ సీరియస్ వార్నింగ్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో మెల్‌బోర్న్‌ (Melbourne) వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా (Team India) ఘోర పరాజయం పాలైంది

Update: 2025-01-02 05:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో మెల్‌బోర్న్‌ (Melbourne) వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా (Team India) ఘోర పరాజయం పాలైంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1తో ముందంజలో ఉంది. ఈ క్రమంలోనే జట్టులో సీనియర్ ఆటగాళ్ల తీరుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఐదో రోజు ఆట ముగిసిన వెంటనే భారత డ్రెస్సింగ్ రూం (Dressing Room)లో సెలెక్టర్ల కమిటీ (Committee of Selectors), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma), కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మధ్య విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

అయితే, డ్రెస్సింగ్‌ రూంలో జరిగిన డిస్కషన్‌ లిక్ అవడంపై తాజాగా కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) స్పందించారు. సీరిస్ గురించే తాము డ్రెస్సింగ్ రూంలో చర్చించామని పేర్కొన్నాడు. తాను ఒక వ్యక్తి గురించి మాట్లాడటం అనేది ఉండదని అన్నారు. ఏ అంశపై ఫోకస్ చేయాలన్నది టీమ్‌లో అందరికీ తెలుసని పేర్కొ్న్నారు. రేపటి టెస్ట్ మ్యాచ్ గురించి కాకుండా మరో టాపిక్‌పై చర్చ జరగలేదని అన్నారు. ఆటగాళ్లు, కోచ్‌కు మధ్య జరిగిన సంభాషణ ఇక నుంచి డ్రెస్సింగ్‌ రూంకే పరిమతం కావాలని, బయటకు రాకూడదని అందరికీ సూచించనట్లుగా తెలిపారు. డ్రెస్సింగ్ రూంలో నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉన్నంత వరకు భారత క్రికెట్ భద్రంగా ఉంటుందని కామెంట్ చేశారు. అదేవిధంగా సిడ్నీ వేదికగా జరబోయే చివరి టెస్ట్‌లో ఆకాష్ దీప్‌ (Akash Deep)ను తుది జట్టులోకి తీసుకోవట్లేదని గంభీర్ స్పష్టం చేశారు.     


Also Read...

Glenn McGrath: ఆ ఒక్కడు లేకపోతే సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యేది.. మెక్‌గ్రాత్ సంచలన వ్యాఖ్యలు 

Tags:    

Similar News