ఎమ్మెల్యేలకు నిధులు పెరిగాయ్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రతీ ఏటా బడ్జెట్ నుంచి కేటాయించే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) కింద కేటాయించే నిధులు పెరిగాయి. ప్రతీ ఏటా ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి తలా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలకు తలా రూ. 5 కోట్ల చొప్పున ఈ సంవత్సరం లభించనున్నది. నియోజకవర్గాల్లో అభివృద్ధి […]

Update: 2021-07-02 11:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రతీ ఏటా బడ్జెట్ నుంచి కేటాయించే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) కింద కేటాయించే నిధులు పెరిగాయి. ప్రతీ ఏటా ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి తలా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలకు తలా రూ. 5 కోట్ల చొప్పున ఈ సంవత్సరం లభించనున్నది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయడానికి ఈ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంతకాలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఉండగా ఈ సంవత్సరం నుంచి దాన్ని ఐదు కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు పేర్కొన్నది. ప్రభుత్వం విధాన నిర్ణయం గతంలోనే తీసుకున్నప్పటికీ కరోనా పరిస్థితుల్లో గతేడాది అమలులోకి రాలేదు. కానీ ఈసారి మాత్రం నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనుల కోసం ఐదు కోట్లకు పెంచుతున్నట్లు ఆ జీవో పేర్కొన్నది.

కేంద్ర ప్రభుత్వం సైతం ప్రతీ ఏటా ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయల చొప్పున ‘ఎంపీ లాడ్‘ ఫండ్స్ కింద ఇవ్వడం ఆనవాయితీ. కానీ కరోనా కారణంగా వరుసగా రెండేళ్ళ పాటు దాన్ని నిలిపివేస్తున్నట్లు గతేడాది ప్రకటించింది. ఆ ప్రకారం గతేడాది మొత్తం ఎంపీల నియోజకవర్గాలకు నిధులు విడుదలకాలేదు. ఈ సంవత్సరం కూడా విడుదల కావడంలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మంజూరు చేసింది. వార్షిక బడ్జెట్‌లోనూ రూ. 800 కోట్లను కేటాయించింది.

పల్లె ప్రగతి కోసం మంత్రులకు రూ. 32 కోట్లు

పల్లె, పట్టణ ప్రగతి పథకం అమలు కోసం ప్రతీ మంత్రి దగ్గరా అత్యవసర ఖర్చుల కోసం రెండు కోట్ల రూపాయల చొప్పున పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఇటీవల సమీక్షా సమావేశాల్లో ప్రకటించిన నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి తక్షణం రూ. 32 కోట్లను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో మంత్రి దగ్గర రెండు కోట్ల రూపాయల చొప్పున మొత్తం 16 జిల్లాల కలెక్టర్లకు కలిపి రూ. 32 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద వీటిని నోడల్ అధికారులుగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న జిల్లాల కలెక్టర్లకు వీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, రంగారెడ్డి, కరీంనగర్, నల్లగొండ, గద్వాల, మహబూబ్‌నగర్, జగిత్యాల, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి, ఖమ్మం, హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నోడల్ కలెక్టర్లకు వీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News