కరోనా దెబ్బకు ఫంక్షన్ వాయిదా
దిశ, హైదరాబాద్: కోవిడ్-19 (కరోనా వైరస్) తెలంగాణను తాకడంతో.. జనాలు భయాందోళన చెందుతున్నారు. ఎంతగా అంటే.. ఏకంగా ఫంక్షన్‌లనే వాయిదా వేసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా జనాలు గుంపులుగా ఉండోద్దని సూచించిన నేపథ్యంలో వాయిదాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్‌లోని చింతల్‌లో దంపతులు గోపాల్ రెడ్డి, భారతి తమ 25వ పెళ్లిరోజు వేడుకను జరుపుకునేందుకు సకల ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, గురువారం వేడుక ఉండగా.. వైరస్ భయానికి ఫంక్షన్‌ను రద్దు చేసుకున్నారు. ఆహ్వానం పంపిన బంధువులకు ఫోన్ […]
దిశ, హైదరాబాద్: కోవిడ్-19 (కరోనా వైరస్) తెలంగాణను తాకడంతో.. జనాలు భయాందోళన చెందుతున్నారు. ఎంతగా అంటే.. ఏకంగా ఫంక్షన్‌లనే వాయిదా వేసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా జనాలు గుంపులుగా ఉండోద్దని సూచించిన నేపథ్యంలో వాయిదాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్‌లోని చింతల్‌లో దంపతులు గోపాల్ రెడ్డి, భారతి తమ 25వ పెళ్లిరోజు వేడుకను జరుపుకునేందుకు సకల ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, గురువారం వేడుక ఉండగా.. వైరస్ భయానికి ఫంక్షన్‌ను రద్దు చేసుకున్నారు. ఆహ్వానం పంపిన బంధువులకు ఫోన్ చేసి క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. కాగా, ఫంక్షన్ హాల్‌తో పాటు, ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చి.. చివరకు రద్దు చేసుకోవడం గమనార్హం.
tag: covid-19 effect, function post poned, hyderabad