విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. మరో రెండ్రోజులు ఇలాగే!
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో నిన్న ఈ రోజు భారీ వర్షాలు కురిశాయి. మరో రెండ్రోజుల పాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని వైజాగ్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ భారత ద్వీపకల్ప ప్రాంతంపై ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం చురుగ్గా ఉందని.. ఆంధ్రప్రదేశ్‌పై గాలి విలోమ ప్రభావం తక్కువ స్థాయిలో ఉంటుందని, తద్వారా రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావారణ అధికారులు తెలిపారు. […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో నిన్న ఈ రోజు భారీ వర్షాలు కురిశాయి. మరో రెండ్రోజుల పాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని వైజాగ్ వాతావరణ కేంద్రం తెలిపింది.
దక్షిణ భారత ద్వీపకల్ప ప్రాంతంపై ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం చురుగ్గా ఉందని.. ఆంధ్రప్రదేశ్‌పై గాలి విలోమ ప్రభావం తక్కువ స్థాయిలో ఉంటుందని, తద్వారా రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావారణ అధికారులు తెలిపారు.
ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇంకొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆశావహంగా ఆరంభమవుతుందని రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.