రికార్డు బద్దలు కొట్టిన బెలూనిస్ట్.. ఆకాశంలో అలా సెల్ఫీ..
దిశ, ఫీచర్స్ : ఫ్రెంచ్ డేర్‌డెవిల్‌గా పిలువబడే బెలూనిస్ట్.. ఆకాశంలో అత్యంత ఎత్తున హాట్-ఎయిర్ బెలూన్‌పై నిలబడి తన ప్రపంచ రికార్డును తానే బద్దలు కొట్టాడు. రెమి ఓవ్రార్డ్ ఒక పెద్ద బెలూన్‌పై పశ్చిమ ఫ్రాన్స్‌లోని చాటెల్లెరాల్ట్ మీదుగా 4,016 మీటర్ల (13,175 అడుగులు) గరిష్ట ఎత్తులో ప్రయాణించినట్లు AFP నివేదించింది. ఇక 2019లో 1,217 మీటర్ల ఎత్తులో ట్రావెల్ చేసిన ఓవ్రార్డ్.. తాజా ఫీట్‌తో మునుపటి రికార్డును బద్దలుకొట్టాడు. ఈ స్టంట్‌ను అతను పేరు, ప్రతిష్టల […]
దిశ, ఫీచర్స్ : ఫ్రెంచ్ డేర్‌డెవిల్‌గా పిలువబడే బెలూనిస్ట్.. ఆకాశంలో అత్యంత ఎత్తున హాట్-ఎయిర్ బెలూన్‌పై నిలబడి తన ప్రపంచ రికార్డును తానే బద్దలు కొట్టాడు. రెమి ఓవ్రార్డ్ ఒక పెద్ద బెలూన్‌పై పశ్చిమ ఫ్రాన్స్‌లోని చాటెల్లెరాల్ట్ మీదుగా 4,016 మీటర్ల (13,175 అడుగులు) గరిష్ట ఎత్తులో ప్రయాణించినట్లు AFP నివేదించింది. ఇక 2019లో 1,217 మీటర్ల ఎత్తులో ట్రావెల్ చేసిన ఓవ్రార్డ్.. తాజా ఫీట్‌తో మునుపటి రికార్డును బద్దలుకొట్టాడు.
ఈ స్టంట్‌ను అతను పేరు, ప్రతిష్టల కోసం కాకుండా ఒక గొప్ప కారణం కోసం చేయడం విశేషం. పశ్చిమ ఫ్రాన్స్‌లో అరుదైన నాడీ కండరాల వ్యాధులకు సంబంధించిన పరిశోధన కోసం వార్షిక నిధుల సేకరణకు టెలిథాన్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ రిస్కీ ఫీట్‌కు పూనుకున్నాడు. కాగా ఓవ్రార్డ్ సాహసానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఇక దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఓవ్రార్డ్ తన ట్వీట్‌లో వెల్లడించాడు. ఫ్రాన్స్ వార్షిక చారిటీ క్యాంపెయిన్ ఫోన్ నంబర్ 36-37ని సూచించే విధంగా బెలూన్‌ను భూమి నుంచి కనీసం 3,637 మీటర్ల ఎత్తులో నిలపాలన్నది తన ప్రధాన లక్ష్యమని తెలిపాడు. అయితే బెలూన్ 4,000 మీటర్ల మార్కును దాటి మరింత ఎత్తుకు ఎగిరింది.
వైట్ సూట్, హెల్మెట్ ధరించిన ఓవ్రార్డ్.. తన తండ్రి పైలట్‌గా వ్యవహరించిన బెలూన్‌పై ఈ ఫీట్ సాధించాడని ఫ్రాన్స్ 24 న్యూస్ ఛానెల్ నివేదించింది. బెలూన్ 3,500 మీటర్ల మార్కును దాటినప్పుడు ఆక్సిజన్ శాతం వేగంగా తగ్గిపోవడంతో తనకు ప్రశాంతంగా ఉండమని సూచించినట్లు అతని తండ్రి చెప్పాడు. ఈ సాహసాన్ని ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయగా.. స్ట్రీమింగ్ టైమ్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలలు గడిపి నవంబర్ 9న భూమికి తిరిగి వచ్చిన ఫ్రెంచ్ వ్యోమగామి థామస్ పెస్క్వెట్ కోసం ఓవ్రార్డ్ షౌట్‌అవుట్ ఇచ్చే అవకాశాన్ని పొందాడు. కాగా ఈ ట్రిప్ దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగింది.
https://twitter.com/ouvrard_remi/status/1458740405177143297?s=20