ఫ్రెంచ్ ఓపెన్ ఈ సారి కూడా ఆలస్యం
దిశ, స్పోర్ట్స్: గ్రాండ్‌స్లామ్‌లలో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఈ ఏడాది కూడా ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం మే 17న రోలాండ్ గారోస్ వేదికగా ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కావాల్సి ఉన్నది. అయితే కోవిడ్-19 సెకెండ్ వేవ్ కారణంగా వారం రోజులు ఆలస్యంగా మే 24 నుంచి జూన్ 13 వరకు నిర్వహిస్తున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ గురువారం వెల్లడించింది. గత ఏడాది కూడా కరోనా కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ […]
దిశ, స్పోర్ట్స్: గ్రాండ్‌స్లామ్‌లలో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఈ ఏడాది కూడా ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం మే 17న రోలాండ్ గారోస్ వేదికగా ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కావాల్సి ఉన్నది. అయితే కోవిడ్-19 సెకెండ్ వేవ్ కారణంగా వారం రోజులు ఆలస్యంగా మే 24 నుంచి జూన్ 13 వరకు నిర్వహిస్తున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ గురువారం వెల్లడించింది. గత ఏడాది కూడా కరోనా కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నాలుగు నెలలు ఆలస్యంగా సెప్టెంబర్‌లో నిర్వహించారు. అప్పుడు పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులను అనుమతించారు. ఈ ఏడాది క్లేకోర్ట్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ రౌండ్స్ మే 24 నుంచి 28 వరకు ఆ తర్వాత మే 30 నుంచి జూన్ 13 వరకు మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా జూన్ 13న ఫ్రెంచ్ ఓపెన్ ముగిసిన రెండు వారాలకే లండన్‌లో వింబుల్డన్ ప్రారంభం కావాల్సి ఉన్నది.