నేటి నుంచి ప్రేక్షకులకు అనుమతి
దిశ, స్పోర్ట్స్ : రోలాండ్ గారోస్‌లో ఆదివారం నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 నుంచే క్వాలిఫయర్ మ్యాచ్‌లు ప్రారంభం కాగా, నేటి నుంచి ప్రధాన పోటీలు జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఇంతకు ముందు పలు టెన్నిస్ టోర్నీలకు ప్రేక్షకులను అనుమతించలేదు. అయితే ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడంతో రోజుకు వెయ్యి మంది ప్రేక్షకులకు అనుమతి ఇచ్చింది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌కు 5.20 లక్షల […]
దిశ, స్పోర్ట్స్ : రోలాండ్ గారోస్‌లో ఆదివారం నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 నుంచే క్వాలిఫయర్ మ్యాచ్‌లు ప్రారంభం కాగా, నేటి నుంచి ప్రధాన పోటీలు జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఇంతకు ముందు పలు టెన్నిస్ టోర్నీలకు ప్రేక్షకులను అనుమతించలేదు. అయితే ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడంతో రోజుకు వెయ్యి మంది ప్రేక్షకులకు అనుమతి ఇచ్చింది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌కు 5.20 లక్షల మంది ప్రేక్షకులు స్వయంగా వచ్చి వీక్షించారు. కానీ ఈ ఏడాది ఇందులో మూడు శాతం మందే హాజరుకానున్నారు. రఫేల్ నదాల్ 20వ గ్రాండ్‌స్లామ్ కోసం ఎదురు చూస్తుండగా.. సెరేనా విలియమ్స్ 24వ గ్రాండ్ స్లామ్ గెలిచి రికార్డు సృష్టించాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.