గూగుల్‌పే ప్రతినిధినంటూ పోలీస్‌కు కుచ్చుటోపీ
దిశ, వెబ్ డెస్క్: తాను గూగుల్ పే ప్రతినిధినంటూ పోలీసులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో జనార్దన్ గౌడ్ అనే కానిస్టేబుల్ గూగుల్ పే నుంచి నగదు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఈ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అందుకు సంబంధించిన మెసెజ్ కూడా కానిస్టేబుల్ సెల్ కు వచ్చింది. దీంతో అతను కస్టమర్ కేర్ కు ఫోన్ చేశాడు. కానీ, స్పందనలేదు. కానీ, మరికొంత సేపటికి ఓ […]
దిశ, వెబ్ డెస్క్: తాను గూగుల్ పే ప్రతినిధినంటూ పోలీసులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో జనార్దన్ గౌడ్ అనే కానిస్టేబుల్ గూగుల్ పే నుంచి నగదు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఈ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అందుకు సంబంధించిన మెసెజ్ కూడా కానిస్టేబుల్ సెల్ కు వచ్చింది. దీంతో అతను కస్టమర్ కేర్ కు ఫోన్ చేశాడు. కానీ, స్పందనలేదు. కానీ, మరికొంత సేపటికి ఓ నెంబర్ నుంచి ఆ కాస్టిబుల్ కు ఫోన్ వచ్చింది. వెంటనే అతను మాట్లాడుతూ.. తాను గూగుల్ పే ప్రతినిధినంటూ నమ్మబలికాడు. అనంతరం గూగుల్ పే, ఫోన్ పే పిన్ నెంబర్లు చెప్పాలంటూ నమ్మబలికాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ఆ వివరాలు చెప్పేశాడు. దీంతో కొద్దిసేపటికి కానిస్టేబుల్ ఖాతా నుంచి రూ. 50 వేలు కాజేశాడు. ఈ విషయమై ఆ కానిస్టేబుల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.