అక్టోబర్‌లో రూ. 12,278 కోట్ల విదేశీ నిధులు ఉపసంహరణ!

దిశ, వెబ్‌డెస్క్: రెండు నెలల కొనుగోళ్ల తర్వాత విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) అక్టోబర్‌లో దేశీయ మార్కెట్ల నుంచి రూ. 12,278 కోట్లను వెనక్కి తీసుకున్నారు. తాజా డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 13,550 కోట్లను ఉపసంహరించుకోగా, రుణ విభాగంలో రూ. 1,272 కోట్ల పెట్టుబడులను పెట్టారు. సమీక్షించిన కాలం మొత్తం నికరంగా రూ. 12,278 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో ఎఫ్‌పీఐ కొనుగోళ్లు జరిగాయి. ‘ప్రముఖ గ్లోబల్ […]

Update: 2021-10-31 10:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు నెలల కొనుగోళ్ల తర్వాత విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) అక్టోబర్‌లో దేశీయ మార్కెట్ల నుంచి రూ. 12,278 కోట్లను వెనక్కి తీసుకున్నారు. తాజా డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 13,550 కోట్లను ఉపసంహరించుకోగా, రుణ విభాగంలో రూ. 1,272 కోట్ల పెట్టుబడులను పెట్టారు. సమీక్షించిన కాలం మొత్తం నికరంగా రూ. 12,278 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో ఎఫ్‌పీఐ కొనుగోళ్లు జరిగాయి.

‘ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు భారతీయ ఈక్విటీలను డౌన్‌గ్రేడ్ చేయడంతో ఇన్వెస్టర్లు లాభాలను ఉపసంహరించుకుంటున్నారు. దీనివల్లే విదేశీ పెట్టుబడిదారులు ఎక్కువ విక్రయాలకు సిద్ధపడ్డారని’ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ అన్నారు. అయితే బ్యాంకింగ్, ఆటో రంగాల్లో విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. ప్రధానంగా పెద్ద ఎఫ్‌పీఐలు అమ్మకాలకు దిగడంతో మార్కెట్లలో మరింత బలహీన పడ్డాయని విజయకుమార్ చెప్పారు.

Tags:    

Similar News