నాలుగు రోజుల్లో రూ. 8 వేల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు తగ్గడం, మెరుగైన కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఈ నెల మొదటి నాలుగు రోజుల్లో విదేశీ పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) దాదాపు రూ. 8 వేల కోట్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లో వచ్చాయి. అంతకుముందు ఏప్రిల్‌లో రూ. 9,659 కోట్లు, మేలో రూ. 2,954 కోట్ల నిధులు ఉపసంహరణ జరిగినట్టు డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి. ఇటీవల కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉండటం, టీకా పంపిణీ పురోగతి కారణంగా అధిక ఎఫ్‌పీఐ పెట్టుబడులు స్టాక్ […]

Update: 2021-06-06 08:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు తగ్గడం, మెరుగైన కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఈ నెల మొదటి నాలుగు రోజుల్లో విదేశీ పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) దాదాపు రూ. 8 వేల కోట్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లో వచ్చాయి. అంతకుముందు ఏప్రిల్‌లో రూ. 9,659 కోట్లు, మేలో రూ. 2,954 కోట్ల నిధులు ఉపసంహరణ జరిగినట్టు డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి. ఇటీవల కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉండటం, టీకా పంపిణీ పురోగతి కారణంగా అధిక ఎఫ్‌పీఐ పెట్టుబడులు స్టాక్ మార్కెట్లలో వచ్చి చేరుతున్నట్టు మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు.

డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ఈ నెల 1-4 మధ్య భారత ఈక్విటీ మార్కెట్లలో రూ. 7,968 కోట్ల నికర ఎఫ్‌పీఐలు వచ్చాయి. ఏప్రిల్ నెలకు ముందు గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య ఈక్విటీ మార్కెట్లలోకి మొత్తం రూ. 1.97 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇందులో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రూ. 55,741 కోట్ల ఎఫ్‌పీఐలు ఉన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఎఫ్‌పీఐ పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. భారత కంపెనీల త్రైమాసిక ఫలితాలతో పాటు దీర్ఘకాలిక సానుకూల ఆదాయ వృద్ధి కారణంగా ఎఫ్‌పీఐల వృద్ధి కొనసాగుతుందని హిమాన్షు శ్రీవాస్తవ వెల్లడించారు.

Tags:    

Similar News