జైల్లో నలుగురు ఖైదీలు మృతి.. కారణం అదే!
దిశ, వెబ్‌డెస్క్ : బయట తిరిగిన వాళ్లనే కాదు.. బయటి ప్రపంచానికి సంబంధం లేకుండా కేవలం గదుల్లోనే మగ్గే వారిని కూడా కరోనా వదలడం లేదు. కరోనా జైళ్లలోకి పోయి ఖైదీలను కబలిస్తోంది. ఢిల్లీలోని తీహార్ జైలులో కరోనా పాజిటివ్ తో నలుగురు ఖైదీలు మృతిచెందారు. వారికి కరోనా ఎలా సోకిందో తెలుసుకునే ప్రయత్నంలో జైలు అధికారులు ఉన్నారు. మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడం.., ప్రస్తుతం అది జైళ్లను తాకడంతో జైలు అధికారులు కీలక […]
దిశ, వెబ్‌డెస్క్ : బయట తిరిగిన వాళ్లనే కాదు.. బయటి ప్రపంచానికి సంబంధం లేకుండా కేవలం గదుల్లోనే మగ్గే వారిని కూడా కరోనా వదలడం లేదు. కరోనా జైళ్లలోకి పోయి ఖైదీలను కబలిస్తోంది. ఢిల్లీలోని తీహార్ జైలులో కరోనా పాజిటివ్ తో నలుగురు ఖైదీలు మృతిచెందారు. వారికి కరోనా ఎలా సోకిందో తెలుసుకునే ప్రయత్నంలో జైలు అధికారులు ఉన్నారు.
మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడం.., ప్రస్తుతం అది జైళ్లను తాకడంతో జైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జైల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖైదీలకు అత్యవసర పెరోల్ ,బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. కాగా, ఇప్పటికే కరోనా నేపథ్యంలో అనారోగ్య సమస్యలు ఉన్న ఖైదీలు, అండర్ ట్రయల్, దోషులుగా తేలిన ఖైదీలకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఏడేళ్లలోపు జైలు శిక్ష, జరిమానా విధించబడినవారు, ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి బైయిల్ ఇవ్వాలన్న అంశంపై తీహార్ జైలు, మండోలి జైలు, రోహిణి జైలుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వాజ్యాన్ని తిరిగి మే 4న విచారణ ఢిల్లీ హైకోర్టు చేపట్టనుంది. దీనిపై ఏ నిర్ణయం తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది.