పండగ పూట ఘోర విషాదం.. ట్రాక్టర్ అదుపుతప్పి నలుగురు మృతి

దిశ,పాలేరు: దేవి నవరాత్రుల నిమజ్జనంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముదిగొండ మండలం బాణాపురం వద్ద శనివారం అర్ధరాత్రి ట్రాక్టర్ బోల్తాపడి కమలాపురం కి చెందిన నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దేవిశరన్నవరాత్రి ఉత్సవాల నిమజ్జన కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అవసాని ఉపేందర్(25), చూడబోయిన నాగరాజు(23) ములకలపల్లి ఉమ(38), బిచ్చల ఎలగొండ స్వామి (50) అనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ […]

Update: 2021-10-16 21:44 GMT
పండగ పూట ఘోర విషాదం.. ట్రాక్టర్ అదుపుతప్పి నలుగురు మృతి
  • whatsapp icon

దిశ,పాలేరు: దేవి నవరాత్రుల నిమజ్జనంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముదిగొండ మండలం బాణాపురం వద్ద శనివారం అర్ధరాత్రి ట్రాక్టర్ బోల్తాపడి కమలాపురం కి చెందిన నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దేవిశరన్నవరాత్రి ఉత్సవాల నిమజ్జన కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అవసాని ఉపేందర్(25), చూడబోయిన నాగరాజు(23) ములకలపల్లి ఉమ(38), బిచ్చల ఎలగొండ స్వామి (50) అనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News