నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్ట్

దిశ, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూర్గంపాడులో నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కుర్నపల్లి – బూరుగుపాడు అటవీ ప్రాంతాల్లో మిలీషియా సభ్యులు సంచరిస్తున్నట్లుగా సమాచారం రావడంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే అటవీ దారిలో మందుపాతర అమర్చుతూ నలుగురు వ్యక్తులు పోలీసుల కంటబడ్డారు. వారిని వెంబడించిన భద్రతా దళాలు ఎట్టకేలకు పట్టుకున్నారు. పట్టుబడ్డవారిలో.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కొండపల్లికి చెందిన కుంజం సన్న @ […]

Update: 2021-04-12 11:07 GMT

దిశ, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూర్గంపాడులో నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కుర్నపల్లి – బూరుగుపాడు అటవీ ప్రాంతాల్లో మిలీషియా సభ్యులు సంచరిస్తున్నట్లుగా సమాచారం రావడంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే అటవీ దారిలో మందుపాతర అమర్చుతూ నలుగురు వ్యక్తులు పోలీసుల కంటబడ్డారు. వారిని వెంబడించిన భద్రతా దళాలు ఎట్టకేలకు పట్టుకున్నారు. పట్టుబడ్డవారిలో.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కొండపల్లికి చెందిన కుంజం సన్న @ రమేశ్ (20), చర్ల మండలం వీరాపురానికి చెందిన సోడి పొజ్జే (20), బూరుగుపాడు గ్రామానికి చెందిన వెట్టి ఐత @ చందు (20), కొర్కట్‌పాడుకి చెందిన మడివి రాజే (20)గా గుర్తించారు. ఈ నలుగురు గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నట్లు అంగీకరించారని చర్ల సీఐ బి. అశోక్ తెలిపారు. వీరి నుంచి ఒక టిఫిన్ బాక్స్, 10 జిలెటిన్ స్టిక్స్, ఒక డిటోనేటర్, కార్డెక్స్ వైర్ 25 మీటర్లు, బ్యాటరీ సెల్స్ 4 స్వాధీనం చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News