రెమిడెసివిర్ బ్లాక్ మార్కెట్.. కరీంనగర్‌లో నిందితుల అరెస్ట్
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా బాధితుల అవసరమే ఆసరాగా చేసుకుని కొన్ని ఆసుపత్రుల సిబ్బంది దళారులుగా అవతారం ఎత్తి నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్టుగా “దిశ ” ఇటీవల వెలుగులోకి తెచ్చింది. దళారులుగా తయారైన ఆసుపత్రి సిబ్బంది అడ్డంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. ఈ విషయంపై కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని టాస్క్ ఫోర్స్ వింగ్‌ను ఆదేశించారు. ఈ మేరకు టాస్క్ వేసిన పోలీసులు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో పని […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా బాధితుల అవసరమే ఆసరాగా చేసుకుని కొన్ని ఆసుపత్రుల సిబ్బంది దళారులుగా అవతారం ఎత్తి నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్టుగా “దిశ ” ఇటీవల వెలుగులోకి తెచ్చింది. దళారులుగా తయారైన ఆసుపత్రి సిబ్బంది అడ్డంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. ఈ విషయంపై కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని టాస్క్ ఫోర్స్ వింగ్‌ను ఆదేశించారు. ఈ మేరకు టాస్క్ వేసిన పోలీసులు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తూ రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు.
కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, అనేస్తేషియా టెక్నీషియన్, రిసెప్సనిస్ట్, డ్రైవర్‌లుగా పని చేస్తున్న లావుడ్యా అంజనీ కుమార్, చోపరి గోపిచంద్, గజ్జెల శ్యామ్ కుమార్, గంటల యుగంధర్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురిని కరీంనగర్ పట్టణ పరిధి కిసాన్ నగర్‌లోని ప్రవిష్ట అపార్ట్మెంట్ వద్ద ఇంజెక్షన్లు అమ్ముతుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 7 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, రూ.4,530 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎమ్మార్పీ ధరలకు మించి ఇంజెక్షన్లు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఆస్పత్రి యాజమాన్యం ఇటువంటి వాటికి సపోర్ట్ చేస్తూ ఊరుకునేది లేదని.. కేసులు నమోదు చేస్తామన్నారు.