భైంసాలో ఇకనుంచి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు : ఏఎస్‌పీ కిరణ్ కారే
దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న పలువురిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్‌పీ కిరణ్ కారే మాట్లాడుతూ.. గంజాయి విక్రయాలు సాగిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భైంసాలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న వారిపై నిఘా పెట్టామన్నారు. పూర్తి గంజాయి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం మా పోలీసుల లక్ష్యమని అన్నారు. మహారాష్ట్ర, ఆదిలాబాద్, […]
దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న పలువురిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్‌పీ కిరణ్ కారే మాట్లాడుతూ.. గంజాయి విక్రయాలు సాగిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భైంసాలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న వారిపై నిఘా పెట్టామన్నారు. పూర్తి గంజాయి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం మా పోలీసుల లక్ష్యమని అన్నారు.
మహారాష్ట్ర, ఆదిలాబాద్, ఇచ్చోడా వంటి ప్రాంతాల నుండి గంజాయి వస్తున్నట్లు సమాచారం ఉందని, దీనిపై పూర్తి నిఘా ఉంచామన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీ.ఐ ప్రవీణ్ కుమార్, భైంసా రూరల్ సీ.ఐ చంద్ర శేఖర్ పాల్గొన్నారు.