వరుసగా 44 ఏళ్లు సర్పంచ్‌గా రికార్డు.. ‘వీరస్వామి’ ఇకలేరు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 44 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేసి రికార్డు సృష్టించిన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం, అమిస్తాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ వీరస్వామి (92) ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చిన్నప్పటి నుండి సామాజిక భావాలు గల వీరస్వామి గ్రామంలో ఆర్య సమాజం. తదితర కార్యక్రమాలలో పాల్గొంటూ గ్రామ సర్పంచ్‌గా ఎంపికయ్యారు. మూడు సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికైన వీరస్వామి మరికొన్ని […]

Update: 2021-11-21 12:03 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 44 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేసి రికార్డు సృష్టించిన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం, అమిస్తాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ వీరస్వామి (92) ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చిన్నప్పటి నుండి సామాజిక భావాలు గల వీరస్వామి గ్రామంలో ఆర్య సమాజం. తదితర కార్యక్రమాలలో పాల్గొంటూ గ్రామ సర్పంచ్‌గా ఎంపికయ్యారు. మూడు సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికైన వీరస్వామి మరికొన్ని సార్లు పోటీ చేయడం ద్వారా సర్పంచ్ గా ఎంపికై వరుసగా 44 సంవత్సరాల పాటు ముస్తాపూర్ గ్రామ సర్పంచ్ గా పని చేశారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్యుత్తు. విద్య, తాగునీటి సౌకర్యాలను కల్పించుకున్న గ్రామంగా అమిస్తాపూర్ ను వీరస్వామి అభివృద్ధి చేశారు. ఉన్ని సంఘం ఏర్పాటు, జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల స్థాపన, మండల పరిషత్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన స్థలాల సేకరణ తదితర అంశాల విషయంలో వీరస్వామి ప్రధాన భూమికను పోషించారు. సర్పంచిగా బాధ్యతల నుండి తప్పుకున్న అనంతరం సైతం తాను మద్దతు తెలిపిన వారే సర్పంచ్‌గా ఎంపికయ్యారు. కాగా వీరస్వామికి ముగ్గురు కుమారులు ఉన్నారు. సోమవారం వారి స్వగ్రామమైన అమిస్తాపూర్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.

Tags:    

Similar News