ప్రణబ్ మృతి తీవ్రంగా కలచి వేసింది

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల టీఆర్ఎస్ నేత, మాజీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే తీవ్ర విచారం తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలో చికిత్సపొందుతున్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం మృతి చెందారనే వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాజీ భారత రాష్ట్రపతిగా, మాజీ కేంద్ర మంత్రిగా, పలు అత్యున్నతస్థాయి […]

Update: 2020-08-31 08:41 GMT
ప్రణబ్ మృతి తీవ్రంగా కలచి వేసింది
  • whatsapp icon

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల టీఆర్ఎస్ నేత, మాజీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే తీవ్ర విచారం తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలో చికిత్సపొందుతున్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం మృతి చెందారనే వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాజీ భారత రాష్ట్రపతిగా, మాజీ కేంద్ర మంత్రిగా, పలు అత్యున్నతస్థాయి పదవుల్లో ప్రణబ్ ముఖర్జీ సమర్థవంతమైన బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు. ఆ మహానాయకుడు మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.

Tags:    

Similar News