కార్మికులకు మెరుగైన వైద్యం అందించండి : కవిత

దిశప్రతినిధి, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ RK-5 బి గనిలో బొగ్గు బ్లాస్టింగ్ కోసం హోల్స్ వేసే క్రమంలో మిస్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో కోల్ కట్టర్ రత్నం లింగయ్య అనే కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో కార్మికులు గాది శివయ్య, పల్లె రాజయ్య, చిలుక సుమన్ సైతం గాయపడ్డారు. వీరికి చికిత్స అందించేందుకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స […]

Update: 2020-09-02 20:32 GMT

దిశప్రతినిధి, ఆదిలాబాద్:

మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ RK-5 బి గనిలో బొగ్గు బ్లాస్టింగ్ కోసం హోల్స్ వేసే క్రమంలో మిస్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో కోల్ కట్టర్ రత్నం లింగయ్య అనే కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు.

ఈ ప్రమాదంలో కార్మికులు గాది శివయ్య, పల్లె రాజయ్య, చిలుక సుమన్ సైతం గాయపడ్డారు. వీరికి చికిత్స అందించేందుకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘గాయపడిన కార్మికులు వెంటనే కోలుకోవాలని.. వారికి సింగరేణి సంస్థ నాణ్యమైన వైద్యం అందించాలని’ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా కోరారు.

Tags:    

Similar News