ఆ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి : కవిత

దిశ, నిజామాబాద్: బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, గురువారం సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించారు. కార్మికుల సమ్మెతో గనులు అన్ని మూతపడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు వేలం వేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ, దేశవ్యాప్తంగా వేలాదిమంది బొగ్గు గని కార్మికులు సమ్మెలో […]

Update: 2020-07-02 07:41 GMT

దిశ, నిజామాబాద్: బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, గురువారం సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించారు. కార్మికుల సమ్మెతో గనులు అన్ని మూతపడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు వేలం వేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ, దేశవ్యాప్తంగా వేలాదిమంది బొగ్గు గని కార్మికులు సమ్మెలో ఉన్నారన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్‌ పార్టీ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ సైతం సమ్మెలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా తాము డిమాండ్‌ చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News