మాస్కు చలానా.. పోలీసులతో మాజీ ఎమ్మెల్యే వాగ్వాదం

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : కొవిడ్–19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు అధికారులు అదే పనిగా చెబుతున్నారు. అయితే మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి మాస్క్ ధరించకుండా కారులో ప్రయాణిస్తున్న విషయాన్ని పోలీసులు గమనించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కర్మాన్‌ఘాట్ చౌరస్థాలో మంగళవారం సరూర్ నగర్ పోలీసులు తనీఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి కారులో మాస్కులేకుండా ప్రయాణిస్తుండటంతో రూ.1000 చలాన్ వేశారు. ఈ విషయంపై కృష్ణారెడ్డి ఏ […]

Update: 2021-05-11 11:10 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : కొవిడ్–19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు అధికారులు అదే పనిగా చెబుతున్నారు. అయితే మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి మాస్క్ ధరించకుండా కారులో ప్రయాణిస్తున్న విషయాన్ని పోలీసులు గమనించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కర్మాన్‌ఘాట్ చౌరస్థాలో మంగళవారం సరూర్ నగర్ పోలీసులు తనీఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి కారులో మాస్కులేకుండా ప్రయాణిస్తుండటంతో రూ.1000 చలాన్ వేశారు. ఈ విషయంపై కృష్ణారెడ్డి ఏ విధంగా నాకు చలాన్ వేస్తారని సరూర్ నగర్ ఎస్ఐ ముఖేశ్‌తో వాగ్వాదానికి దిగారు. ఇందుకు ముఖేశ్ సమాధానం ఇస్తూ మాకు అంతా సమానులే అంటూ పోలీసులు రూ.1000 చలాన్ విధించారు.

Tags:    

Similar News