సీఎం కేసీఆర్‌పై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
దిశ, జగిత్యాల: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఉద్యమ సమయంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ లేకుండా చేస్తానని కేసీఆర్ అంటే రెగ్యూలర్ చేస్తారని కలలు కన్నారని, అయితే వ్యవస్థనే లేకుండా చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకునే మిషన్ భగీరథలో వివిధ కేటగిరీలో పనిచేసే 10 వేల మంది […]
దిశ, జగిత్యాల: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఉద్యమ సమయంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ లేకుండా చేస్తానని కేసీఆర్ అంటే రెగ్యూలర్ చేస్తారని కలలు కన్నారని, అయితే వ్యవస్థనే లేకుండా చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకునే మిషన్ భగీరథలో వివిధ కేటగిరీలో పనిచేసే 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని, మిషన్ భగీరథ ట్యాంకులెక్కి నిరసన తెలిపినా పట్టించుకోకుండా ఏకపక్షంగా వారిని తొలగించడం అన్యాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం పనుల పర్యవేక్షణ చేసే 10వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించడం కూడా అవివేకమన్నారు. ధనిక రాష్ట్ర మని చెప్పుకుంటున్న కేసీఆర్ ఉద్యోగాలను తొలగిస్తున్నారని, పక్క రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే ప్రక్రియ చేపట్టిందని జీవన్ రెడ్డి గుర్తుచేశారు.