ఓవైసీ వ్యాఖ్యలు బాధాకరం : డీకే అరుణ

దిశ, మహబూబ్‌నగర్: కరోనాపై పోరాటానికి ప్రధాని మోదీ ‘దీపం’ వెలిగించాలంటే దానిని కూడా మత కోణంతో చూడటం అవివేకమని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. ప్రజలందరూ ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ఆమె కోరారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని అవమానించేలా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడటం బాధాకరమని అన్నారు. వైద్యులకు కృతజ్ఞత తెలపడం ఓవైసీకి తెలియదని, ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలని ఆమె హితువు పలికారు. దేశ ఐక్యత […]

Update: 2020-04-04 22:02 GMT

దిశ, మహబూబ్‌నగర్: కరోనాపై పోరాటానికి ప్రధాని మోదీ ‘దీపం’ వెలిగించాలంటే దానిని కూడా మత కోణంతో చూడటం అవివేకమని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. ప్రజలందరూ ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ఆమె కోరారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని అవమానించేలా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడటం బాధాకరమని అన్నారు. వైద్యులకు కృతజ్ఞత తెలపడం ఓవైసీకి తెలియదని, ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలని ఆమె హితువు పలికారు. దేశ ఐక్యత కోసం ప్రధాని మోదీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. వైద్యులకు మనోధైర్యం అందించే కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయుడూ పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.

Tags: Former minister DK Aruna, fire, MP Asaduddin, mim, april 5th, lights

Tags:    

Similar News