ఎర్రన్నాయుడుపై కక్షతోనే ఇదంతా : దేవినేని ఉమ
దిశ, అమరావతి బ్యూరో: ఎర్రన్నాయుడు కుటుంబం నాలుగు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. జగన్‌పై అక్రమ ఆస్తుల కేసుపై ఎర్రన్నాయుడు సంతకం చేశారని కక్ష గట్టారన్నారు. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడుపై కేసు పెట్టి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగోలేకపోయినా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. అచ్చెన్నను జైలుకు పంపేందుకు కుట్ర పన్నారన్నారు. అందుకే జగన్ ఆయనపై కుట్రతో కేసులు పెట్టారన్నారు. అవినీతి జరిగినట్టు ఆధారాలు లేకపోయినా కేసులు […]
దిశ, అమరావతి బ్యూరో: ఎర్రన్నాయుడు కుటుంబం నాలుగు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. జగన్‌పై అక్రమ ఆస్తుల కేసుపై ఎర్రన్నాయుడు సంతకం చేశారని కక్ష గట్టారన్నారు. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడుపై కేసు పెట్టి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగోలేకపోయినా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. అచ్చెన్నను జైలుకు పంపేందుకు కుట్ర పన్నారన్నారు. అందుకే జగన్ ఆయనపై కుట్రతో కేసులు పెట్టారన్నారు. అవినీతి జరిగినట్టు ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టారన్నారు. అవినీతి బురదలో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. తమ పార్టీ నాయకుడిపై బురద చల్లుతోందని దేవినేని ఉమ ఆరోపించారు.