మాజీ న్యాయమూర్తి కర్ణన్ అరెస్ట్
చెన్నై: మహిళా న్యాయమూర్తులు, న్యాయమూర్తుల భార్యలపై అనుచిత వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్‌ను బుధవారం చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల భార్యలు, మహిళా న్యాయమూర్తులను తూలనాడుతూ యూట్యూబ్‌లో సీఎస్ కర్ణన్ వీడియో పోస్టు చేశారు. ఈ విషయమై ఆయనపై పరువు నష్టం దావాతోపాటు నేరపూరిత వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదైంది. కర్ణన్‌పై తగిన చర్యలు తీసుకోకపోవడంపై ఇటీవల మద్రాస్ హైకోర్టు పోలీసులను తీవ్రంగా […]
చెన్నై: మహిళా న్యాయమూర్తులు, న్యాయమూర్తుల భార్యలపై అనుచిత వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్‌ను బుధవారం చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల భార్యలు, మహిళా న్యాయమూర్తులను తూలనాడుతూ యూట్యూబ్‌లో సీఎస్ కర్ణన్ వీడియో పోస్టు చేశారు. ఈ విషయమై ఆయనపై పరువు నష్టం దావాతోపాటు నేరపూరిత వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదైంది. కర్ణన్‌పై తగిన చర్యలు తీసుకోకపోవడంపై ఇటీవల మద్రాస్ హైకోర్టు పోలీసులను తీవ్రంగా ఆక్షేపించింది. హైకోర్టు వ్యాఖ్యలతో కేసును సీరియస్‌గా తీసుకున్న చెన్నై పోలీసులు బుధవారం కర్ణన్ అరెస్టు చేశారు.
2017లో మాజీ న్యాయమూర్తి కర్ణన్ తొలిసారి పోలీసులు అరెస్టు చేశారు. దేశ న్యాయ చరిత్రలో ఓ సిట్టింగ్ జడ్జి జైలుకు వెళ్లడం అదే తొలిసారి. సీనియర్ న్యాయమూర్తులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కోల్‌కతా న్యాయమూర్తిగా ఉన్న సమయంలో కర్ణన్ లేఖ రాశారు. ఈ విషయమై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నేరం కింద కర్ణన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కొన్ని వారాలపాటు తప్పించుకు తిరిగిన ఆయన్ని మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. 2018లో యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ(ఏసీడీడీ)ని సీఎస్ కర్ణన్ స్థాపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.