కరోనాతో టీమిండియా మాజీ క్రికెటర్ మృతి

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ సోకి టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్(73) మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల గురుగ్రామ్‌లోని మెదంత ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయనకు కరోనా కూడా సోకడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయన ఆదివారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. చేతన్ చౌహాన్ 1969-78 కాలంలో టీం ఇండియా తరఫున 40 టెస్టులు 7 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 31.57 సగటుతో […]

Update: 2020-08-16 07:26 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ సోకి టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్(73) మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల గురుగ్రామ్‌లోని మెదంత ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయనకు కరోనా కూడా సోకడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయన ఆదివారం చికిత్స పొందుతూ కన్నుమూశారు.

చేతన్ చౌహాన్ 1969-78 కాలంలో టీం ఇండియా తరఫున 40 టెస్టులు 7 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 31.57 సగటుతో 2084 పరుగులు, వన్డేల్లో 153 పరుగులు చేశారు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 97 పరుగులు.

Tags:    

Similar News