కాంగ్రెస్‌కు భారీ షాక్.. మాజీ ఎంపీ సుస్మితా రాజీనామా

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సుస్మితా దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా విభాగం ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటికే వరుస వలసతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో భారీ దెబ్బపడినట్లయింది. అంతేగాకుండా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సుస్మితా దేవ్ సోమవారం కోల్‌కతాలో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, […]

Update: 2021-08-15 23:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సుస్మితా దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా విభాగం ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటికే వరుస వలసతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో భారీ దెబ్బపడినట్లయింది. అంతేగాకుండా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సుస్మితా దేవ్ సోమవారం కోల్‌కతాలో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది మార్చిలో, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై సుస్మితా దేవ్ పార్టీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. సుస్మితా దేవ్ అస్సాం కాంగ్రెస్ నాయకుడు, బెంగాలీ నాయకుడు సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె. సుస్మితా దేవ్ గతంలో తన తండ్రికి పట్టుగా ఉండే సిల్చార్ సీటు నుండి ఎంపీగా ఎన్నికయ్యారు.

Tags:    

Similar News