బీసీసీఐపై మాజీల గుర్రు

దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐపై మాజీ క్రికెటర్లు విరుచుకపడుతున్నారు. డబ్బు పుష్కలంగా ఉండటంతో బీసీసీఐ ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారిందని దుయ్యబడుతున్నారు. ఐపీఎల్ లాంటి స్థానిక లీగ్ కోసం టీ20 వరల్డ్ కప్‌ను ఆపేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నవారిలో ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్లే ఉండటం విశేషం. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియాలో పురుషుల టీ-20 వరల్డ్ కప్ జరగాలి. కానీ బీసీసీఐ ఒత్తిడో.. మరో కారణమో […]

Update: 2020-05-23 03:54 GMT

దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐపై మాజీ క్రికెటర్లు విరుచుకపడుతున్నారు. డబ్బు పుష్కలంగా ఉండటంతో బీసీసీఐ ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారిందని దుయ్యబడుతున్నారు. ఐపీఎల్ లాంటి స్థానిక లీగ్ కోసం టీ20 వరల్డ్ కప్‌ను ఆపేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నవారిలో ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్లే ఉండటం విశేషం. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియాలో పురుషుల టీ-20 వరల్డ్ కప్ జరగాలి. కానీ బీసీసీఐ ఒత్తిడో.. మరో కారణమో తెలియదు కానీ.. కరోనా ప్రభావం పేరుతో దాన్ని ఐసీసీ వాయిదా వేస్తోన్నది. ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోయినా.. టీ-20 వరల్డ్ కప్ వాయిదా ఖాయమేనని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ కోసమే బీసీసీఐ మెగా టోర్నీని వాయిదా వేయించిందని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ కేవలం స్థానిక లీగ్ మాత్రమేనని.. ఇందుకోసం ప్రపంచ కప్ ఎలా రద్దు చేస్తారని మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్ అంటున్నాడు. కరోనా ప్రభావం కారణంగా టీ20 వరల్డ్ కప్ రద్దు చేస్తే.. ఆ సమయంలో ఐపీఎల్ ఎలా ఆడతారని అంటున్నాడు. ఒక వేళ అక్టోబర్-నవంబర్ మాసాల్లో ఐపీఎల్ నిర్వహిస్తే.. ఇతర దేశాల బోర్డులు తమ ఆటగాళ్లను పంపొద్దని డిమాండ్ చేస్తున్నాడు. బీసీసీఐ ఇచ్చే డబ్బులకు ఐసీసీ దాసోహం అయ్యిందని ఆరోపిస్తున్నారు.

బీసీసీఐ ఎప్పటి నుంచో ప్రపంచ పెద్దన్న పాత్రను పోషించాలని ఆరాటపడుతోందని… తమ దగ్గర ఉన్న డబ్బును చూపి ఇతర బోర్డులను మచ్చిక చేసుకుంటోందని పరోక్షంగా ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ విమర్శించాడు. తమ దగ్గర నిర్వహించాల్సిన మెగా టోర్నీని బీసీసీఐ వాయిదా వేయిస్తున్నా ఆస్ట్రేలియా ఎందుకు నోరు మూసుకొని ఉంటుందని బోర్డర్ ప్రశ్నిస్తున్నాడు. ప్రపంచ క్రికెట్‌కు ఐసీసీనే పెద్దన్న కానీ బీసీసీఐ కాదని అంటున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, విండీస్ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ జరిగితేనే మంచిదని.. ఆటగాళ్లకే కాకుండా క్రికెట్‌కు ఐపీఎల్ వల్ల చాలా లాభమని అంటున్నారు. అలెన్ బోర్డర్‌కు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మద్దతు పలుకుతున్నారు. మెగా టోర్నీని అక్టోబర్‌లో జరపాల్సిందేనని పట్టుబడుతున్నారు.

Tags:    

Similar News