సంఘటనలు అంచనా వేసే ఫోర్‌క్యాస్ట్
కరోనా ఎంతకాలం ఉంటుంది? ఈ సారి అవార్డు వేడుకలు జరుగుతాయా?.. లాంటి ప్రశ్నలకు ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పగలరు. ఎలాంటి అధ్యయనం అవసరం లేకుండా నోటిమాటగా అంచనా వేసి వీటికి సమాధానం చెప్తారు. ఇలాంటి అంచనాలనే అందరూ వేస్తే, ఎక్కువ మంది ఏమనుకుంటున్నారో తెలిసి ఒక సమాధానాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా భవిష్యత్ సంఘటనల గురించి అంచనాలు వేయగలిగే యాప్ ఉంటే బాగుంటుందనిపిస్తోంది కదా.. అందుకే ఫేస్‌బుక్ వారు కొత్తగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీనికి […]
కరోనా ఎంతకాలం ఉంటుంది? ఈ సారి అవార్డు వేడుకలు జరుగుతాయా?.. లాంటి ప్రశ్నలకు ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పగలరు. ఎలాంటి అధ్యయనం అవసరం లేకుండా నోటిమాటగా అంచనా వేసి వీటికి సమాధానం చెప్తారు. ఇలాంటి అంచనాలనే అందరూ వేస్తే, ఎక్కువ మంది ఏమనుకుంటున్నారో తెలిసి ఒక సమాధానాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా భవిష్యత్ సంఘటనల గురించి అంచనాలు వేయగలిగే యాప్ ఉంటే బాగుంటుందనిపిస్తోంది కదా.. అందుకే ఫేస్‌బుక్ వారు కొత్తగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీనికి ‘ఫోర్‌క్యాస్ట్’ అని పేరు పెట్టారు. ఇది అంచనాలను వాస్తవ ఫలితాలుగా మార్చి పరిశోధనల్లో సాయం చేస్తుంది.
ఇప్పటికే ఈ ఫోర్‌క్యాస్ట్‌ను తమ అంతర్గత సిబ్బందితో ఫేస్‌బుక్ టెస్ట్ చేసింది. ఇప్పుడు కొందరు ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానుంది. అమెరికా, కెనడాల్లో కొన్ని భవిష్యత్ సంఘటనల గురించి అంచనాలు వేయాలని ఇప్పటికే కొందరిని ఆహ్వానించింది. కొవిడ్ 19 ప్రధాన అంశంగా ఈ కమ్యూనిటీ ప్రెడిక్షన్లు చేయనుంది. ఈ అంచనాలను ఫోర్‌క్యాస్ట్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయనున్నట్లు ఫేస్‌బుక్ తమ బ్లాగు పోస్టులోనూ పేర్కొంది. కాగా ఆరోగ్యం, రీసెర్చ్, అకాడమిక్స్ విషయాల్లో ఎక్కువ అంచనాలు వేసి, తమ అంచనాల వెనక కారణాలను పంచుకోవడం ద్వారా నాలెడ్జి పెరిగే అవకాశం ఉంటుందని ఫేస్‌బుక్ అభిప్రాయపడింది. ముఖ్యంగా ఫేక్ న్యూస్ విషయంలో కూడా ఈ ప్రెడిక్షన్లు ఉపయోగకరంగా ఉండనున్నాయని ఫేస్‌బుక్ తెలిపింది. అంతేకాకుండా ఈ అంచనాల వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుందని, మార్కెటింగ్ రంగంలో కూడా ఇది బాగా ఉపయోగపడనుందని ఫేస్‌బుక్ వివరించింది.