ఫోర్డ్ ఇండియా సరికొత్త SUV వేరియంట్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్ : దిగ్గజ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా 2021 ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో సోమవారం విడుదల చేసింది. సరికొత్త ఎకోస్పోర్ట్ ఇదివరకటి కంటే అనేక మార్పులతో వస్తోంది. కొత్త ఫీచర్స్ వినియోగదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త ఎకోస్పోర్ట్ 2021 ధర రూ. 7.99 లక్షలతో(ఎక్స్‌షోరూమ్) లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది పాత వెర్షన్‌తో పోలిస్తే రూ. 35 వేల వరకు తక్కువ. ఈ కొత్త ఎకోస్పోర్ట్‌లో టైటానియం ట్రిమ్‌తో […]
దిశ, వెబ్‌డెస్క్ : దిగ్గజ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా 2021 ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో సోమవారం విడుదల చేసింది. సరికొత్త ఎకోస్పోర్ట్ ఇదివరకటి కంటే అనేక మార్పులతో వస్తోంది. కొత్త ఫీచర్స్ వినియోగదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త ఎకోస్పోర్ట్ 2021 ధర రూ. 7.99 లక్షలతో(ఎక్స్‌షోరూమ్) లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది పాత వెర్షన్‌తో పోలిస్తే రూ. 35 వేల వరకు తక్కువ. ఈ కొత్త ఎకోస్పోర్ట్‌లో టైటానియం ట్రిమ్‌తో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అందిస్తోంది. ఇదివరకు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ స్పోర్ట్ వేరియంట్‌లో మాత్రమే ఉండేది.
కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 5 వేరియంట్‌లలో లభిస్తుందని..అప్-యాంబియంట్, ట్రెండ్, టైటానియం, టైటానియం ప్లస్, టైటానియం స్పోర్ట్‌లలో దొరుకుతుందని కంపెనీ తెలిపింది. అన్ని వేరియంట్లు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లను కలిగి ఉన్నాయి. టాప్ వేరియంట్ ధర రూ. 11.49 లక్షలు(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ). ఈ సరికొత్త ఎకోస్పోర్ట్‌లో తమ ఎస్‌యూవీని స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇతర ఫీచర్లను ఆపరేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. స్టార్ట్, స్టాప్, లాక్ అండ్ అన్‌లాక్, ఏసీ కంట్రోల్ లాంటి అనే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటన్నిటిఈ ఫోర్డ్‌పాస్ యాప్ నుంచి కూడా కంట్రోల్ చేయవచ్చని కంపెనీ వివరించింది.