ఆర్సనిక్-30తో కోవిడ్-19కు చెక్..
దిశ, హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. కానీ ఇంతవరకు ఈ వైరస్‌కు మందు కనుగొనలేదు. కరోనా నివారణ మందును కనిపెట్టినట్టు అమెరికా వైద్యులు ప్రకటించుకున్నా, అది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. కరోనా వైరస్ ఎంటర్ అయ్యాక దాని నివారణకు మందుల కోసం వెతికే కంటే ఆ లక్షణాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆయుశ్ విభాగం ద్వారా ఆర్సనిక్-30పేరుతో హోమియోపతి మందులను […]
దిశ, హైదరాబాద్
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. కానీ ఇంతవరకు ఈ వైరస్‌కు మందు కనుగొనలేదు. కరోనా నివారణ మందును కనిపెట్టినట్టు అమెరికా వైద్యులు ప్రకటించుకున్నా, అది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. కరోనా వైరస్ ఎంటర్ అయ్యాక దాని నివారణకు మందుల కోసం వెతికే కంటే ఆ లక్షణాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆయుశ్ విభాగం ద్వారా ఆర్సనిక్-30పేరుతో హోమియోపతి మందులను అనుమానితులకు పంపిణీ చేస్తుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇప్పటివరకూ థర్మల్ స్క్రీనింగ్ జరిపిన వారికి ఆర్సనిక్-30మందులు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. వీటి వినియోగం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని డాక్టర్లు చెబుతున్నారు. ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే ఆర్సనిక్-30 వాడాలని, దీనితో వైరస్ రాకుండా కంట్రోల్ చేయవచ్చునని ప్రభుత్వం చెబుతోంది. కాగా, ఈ మందులను అన్ని వయస్సుల వారూ ఉపయోగించవచ్చునని వైద్యులు తెలిపారు.
tags ; arsenic -30, hyd, state ayush mission, use all age groups, for preventing carona, no side effects