వచ్చే ఏడాది 10 లక్షల మందికి ఉపాధి!
దిశ, వెబ్‌డెస్క్: 2020లో కరోనా వల్ల దారుణంగా దెబ్బతిన్న తర్వాత రెస్టారెంట్ పరిశ్రమ పునరుజ్జీవనం వైపు పయనిస్తోంది. ఈ క్రమంలో పరిశ్రమ 2021 నాటికి దాదాపు 10 లక్షల మందిని తిరిగి నియమించుకునే అవకాశముందని ప్రముఖ ఫుడ్ అండ్ రెస్టారెంట్ ప్లాట్‌ఫామ్ డైన్ఔట్ తెలిపింది. ఇటీవల పెరిగిన పోషకాహార ప్రాధాన్యత నేపథ్యంలో సుమారు 45 శాతం మంది యువత ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకుంటున్నారని చెప్పింది. రెస్టారెంట్లు సైతం కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలని […]
దిశ, వెబ్‌డెస్క్: 2020లో కరోనా వల్ల దారుణంగా దెబ్బతిన్న తర్వాత రెస్టారెంట్ పరిశ్రమ పునరుజ్జీవనం వైపు పయనిస్తోంది. ఈ క్రమంలో పరిశ్రమ 2021 నాటికి దాదాపు 10 లక్షల మందిని తిరిగి నియమించుకునే అవకాశముందని ప్రముఖ ఫుడ్ అండ్ రెస్టారెంట్ ప్లాట్‌ఫామ్ డైన్ఔట్ తెలిపింది. ఇటీవల పెరిగిన పోషకాహార ప్రాధాన్యత నేపథ్యంలో సుమారు 45 శాతం మంది యువత ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకుంటున్నారని చెప్పింది. రెస్టారెంట్లు సైతం కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలని భావిస్తున్నాయి. మారిన టెక్నాలజీ వినియోగం నేపథ్యంలో రెస్టారెంట్లు డిజిటల్ మెనూలను ప్రవేశపెట్టేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
‘ఈ లక్ష్యాలను చేరుకునేందుకు రెస్టారెంట్ పరిశ్రమ సుమారు 10 లక్షల మందిని తిరిగి ఉపాధిలోకి తీసుకోవాలని యోచిస్తోంది. వీరి ద్వారా కిచెన్ ప్రాంతాలను మరింత మెరుగ్గా నిర్వాహించాలని, మెనూ డిజిటలైజ్ చేసేందుకు అవసరమైన నమూనాను తీసుకు రావాలనుకుంటున్నాం. థర్డ్ పార్టీలపై ఆధారపడటం తగ్గించాలని భావిస్తున్నట్టు’ డైన్ఔట్ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో అంకిత్ మెహ్రోత్రా చెప్పారు. వచ్చే ఏడాది నుంచి వంద శాతం కస్టమర్లు కాంటాక్ట్‌లెస్, డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా వినియోగిస్తారనే అంచనాలున్నాయి, అలాగే టేక్అవేలు 15 శాతం, డెలివరీలు 30.5 శాతం పెరిగే అవకాశలున్నాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పరిశ్రమలో 13 శాతంగా ఉన్న కేవలం ఫుడ్ డెలివరీ క్లౌడ్ కిచెన్‌లు రాబోయే ఏడాదిలో 30 శాతానికి పెరుగుతాయని డైన్ఔట్ తెలిపింది.