కరీంనగర్ ప్రాజెక్టుల్లోకి వరద యథాతథం
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి వరద నీటి ప్రవాహం యథావిదిగా కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టులు, బ్యారేజీల నుండి దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని వదులుతున్నారు. ఎల్లపల్లి ప్రాజెక్టులోని 8 గేట్లను 2 మీటర్ల ఎత్తువరకు ఎత్తిన అధికారులు 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలగా, సుందిల్ల బ్యారేజ్ 50 గేట్లను ఎత్తి 83 వేల 529 క్యూసెక్కుల నీటిని వదిలారు. అన్నారం బ్యారేజ్ 25 గేట్ల ద్వారా లక్షా 48 వేల 749 […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి వరద నీటి ప్రవాహం యథావిదిగా కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టులు, బ్యారేజీల నుండి దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని వదులుతున్నారు. ఎల్లపల్లి ప్రాజెక్టులోని 8 గేట్లను 2 మీటర్ల ఎత్తువరకు ఎత్తిన అధికారులు 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలగా, సుందిల్ల బ్యారేజ్ 50 గేట్లను ఎత్తి 83 వేల 529 క్యూసెక్కుల నీటిని వదిలారు. అన్నారం బ్యారేజ్ 25 గేట్ల ద్వారా లక్షా 48 వేల 749 క్యూసెక్కుల నీటిని, మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా 4 లక్షల 29 వేల 300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు 5 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుండగా ప్రాజెక్టులో 21 టీఎంసీల నీరు ఉంది. మరో టీఎంసీ నీరు మిడ్ మానేరులోకి వచ్చినట్టయితే ప్రాజెక్టు గేట్లు ఎత్తి లోయర్ మానేరు డ్యాంలోకి వదులుతారు. లోయర్ మానేరు డ్యాం సామర్థ్య 24 .5 టీఎంసీలు కాగా 18.5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మోయతుమ్మెదతో పాటు మానేరు నదుల నుండి ఈ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహాకం కొనసాగుతోంది. ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటిని అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సిరిసిల్లకు ఎగువన ఉన్న అప్పర్ మానేరు ప్రాజెక్టుకు 2 వేల 888 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వస్తోంది.