కృష్ణాలో స్లో అండ్ ఫాస్ట్.. ఎందుకు ?

దిశ, న్యూస్ బ్యూరో : కృష్ణా నదిలో వరదలు తగ్గుతూ పెరుగుతున్నాయి. ఉదయం పెరిగి సాయంత్రానికి తగ్గుతున్నాయి. వరదలను అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి దిగువ వరకూ జల విద్యుత్ ప్లాంట్లను కొనసాగిస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు గురువారం ఉదయం 1.12 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, రాత్రి వరకు 80,712 క్యూసెక్కులకు తగ్గింది. తగ్గుతూ, పెరుగుతుండటంతో ఔట్ ఫ్లోను పెంచారు. రాత్రి వరకు 1.26 లక్షల క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. […]

Update: 2020-08-13 20:42 GMT

దిశ, న్యూస్ బ్యూరో : కృష్ణా నదిలో వరదలు తగ్గుతూ పెరుగుతున్నాయి. ఉదయం పెరిగి సాయంత్రానికి తగ్గుతున్నాయి. వరదలను అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి దిగువ వరకూ జల విద్యుత్ ప్లాంట్లను కొనసాగిస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు గురువారం ఉదయం 1.12 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, రాత్రి వరకు 80,712 క్యూసెక్కులకు తగ్గింది. తగ్గుతూ, పెరుగుతుండటంతో ఔట్ ఫ్లోను పెంచారు. రాత్రి వరకు 1.26 లక్షల క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. 129 టీఎంసీ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుకు గురువారం రాత్రి వరకు 120 టీఎంసీలకు చేరింది. నారాయణపూర్ జలాశయానికి 1.40 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు 1.46 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. 37.64 టీఎంసీల సామర్థ్యమున్న జలాశయంలో నీటిమట్టం ప్రస్తుతం 35 టీఎంసీలకు చేరింది.

జూరాల ప్రాజెక్టుకు గురువారం ఉదయం 25 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా రాత్రికి 65 వేల క్యూసెక్కులకు చేరింది. 9.66 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ఇప్పుడు 7.80 టీఎంసీ నీరుంది. దిగువకు 56,980 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 55 వేల క్యూసెక్కులు వస్తుండగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని కొనసాగిస్తూ 40 వేల క్యూసెక్కులను సాగర్‌కు వదులుతున్నారు. 215 టీఎంసీల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 122 టీఎంసీల నిల్వకు చేరింది. సాగర్‌కు 40వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా 8422 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింత ప్రాజెక్టుకు 1705 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. అలాగే, తుంగభద్ర జలాశయానికి వరద స్థిరంగా కొనసాగుతున్నది. 44,869 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 9796 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నడుస్తున్నది. 100 టీఎంసీలు సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 89.65 టీఎంసీల నీరు ఉంది.

గోదావరి నదిలోనూ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 12,322 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 4545 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. 90 టీఎంసీల సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో 41.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మిడ్ మానేరుకు 16,908 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 149 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఎల్ఎండీకి 1618 క్యూసెక్కులు వస్తుండగా 1013 క్యూసెక్కుల నీటిని కాల్వలకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు 800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కొనసాగుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 27276 క్యూసెక్కులు వస్తుండగా 16,378 క్యూసెక్కులు బయటకు వదులుతున్నారు.

Tags:    

Similar News