వరద సాయం కొనసాగించాలని హైకోర్టులో పిల్..
దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అందించే రూ.10 వేల సాయాన్ని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ సందర్బంగా స్పెషల్ జీపీ శరత్ సోమవారం లంచ్ మోషన్ పిల్ ను దాఖలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో అందించే సాయానికి ఎన్నికల మోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తించదనే విషయాన్ని శరత్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. అయితే, ప్రభుత్వం అందించే రూ.10 వేల వరద సాయం ఎన్నికలపై […]
దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అందించే రూ.10 వేల సాయాన్ని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ సందర్బంగా స్పెషల్ జీపీ శరత్ సోమవారం లంచ్ మోషన్ పిల్ ను దాఖలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో అందించే సాయానికి ఎన్నికల మోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తించదనే విషయాన్ని శరత్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.
అయితే, ప్రభుత్వం అందించే రూ.10 వేల వరద సాయం ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఎన్నికల కమిషన్ న్యాయవాది విద్యాసాగర్ వివరించారు. అసలు వరద సాయంపై ఎన్నికల కమిషన్ విధి విధానాలు తెలపాలని కమషన్ ను హైకోర్టు ఆదేశించింది. దీంతో తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.