ఫ్లిప్‌కార్ట్‌లో న్యూ ఫీచర్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ- కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ‘వాయిస్ అసిస్టెంట్’ ఫీచర్‌ను కస్టమర్లకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. వినియోగదారులు ఈజీగా షాపింగ్ చేసేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఇచ్చే వాయిస్ కమాండ్స్‌ను ఇది అర్థం చేసుకోగలదు. భవిష్యత్తులో మరిన్ని భాషల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ వాయిస్ అసిస్టెంట్‌ను ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ స్టోర్, సూపర్ మార్ట్‌లలో ఉపయోగించవచ్చు. షాపింగ్‌కు […]
దిశ, వెబ్‌డెస్క్:
ప్రముఖ ఈ- కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ‘వాయిస్ అసిస్టెంట్’ ఫీచర్‌ను కస్టమర్లకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. వినియోగదారులు ఈజీగా షాపింగ్ చేసేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఇచ్చే వాయిస్ కమాండ్స్‌ను ఇది అర్థం చేసుకోగలదు. భవిష్యత్తులో మరిన్ని భాషల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ వాయిస్ అసిస్టెంట్‌ను ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ స్టోర్, సూపర్ మార్ట్‌లలో ఉపయోగించవచ్చు. షాపింగ్‌కు సంబంధించిన పదాలను ఇది అర్థం చేసుకోగలదు. వాయిస్ కమాండ్ ద్వారా కొనుగోలు చేసే ప్రొడక్ట్ పేరు చెప్పగానే దానికి సంబంధించిన లిస్ట్‌ను చూపిస్తుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు మాత్రమే వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అందుబాటులో ఉండగా త్వరలోనే ఐవోఎస్ యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చే అవకాశాలున్నాయి.