2030నాటికి ఎలక్ట్రిక్ వాహనాలతో సరఫరా: ఫ్లిప్‌కార్ట్ !
దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్(Flipkart) 2030 నాటికి వస్తువుల సరఫరా వ్యవస్థలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicles)ను ఉపయోగించేందుకు అంతర్జాతీయ సంస్థల(International organizations)తో చేతులు కలపనుంది. రానున్న పదేళ్లలో ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రిక్ వాహనాలను దశలవారీగా తీసుకురానున్నట్టు కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా 1,400 సరఫరా కేంద్రాల పరిధిలో ఛార్జింగ్‌కి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్టు, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించేలా డెలివరీ ఉద్యోగులను ప్రోత్సహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో(CEO) కళ్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలను […]
దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్(Flipkart) 2030 నాటికి వస్తువుల సరఫరా వ్యవస్థలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicles)ను ఉపయోగించేందుకు అంతర్జాతీయ సంస్థల(International organizations)తో చేతులు కలపనుంది. రానున్న పదేళ్లలో ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రిక్ వాహనాలను దశలవారీగా తీసుకురానున్నట్టు కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా 1,400 సరఫరా కేంద్రాల పరిధిలో ఛార్జింగ్‌కి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్టు, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించేలా డెలివరీ ఉద్యోగులను ప్రోత్సహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో(CEO) కళ్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలను పెంచేందుకు క్లైమేట్ గ్రూప్(Climate Group)తో ఒప్పందం చేసుకోనున్నట్టు, తద్వారా పర్యావరణ రక్షణ చర్యలతో పాటు వ్యాపారాభివృద్ధి సాధించగలమనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు.
పైలట్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ఢిల్లీ(Delhi), హైదరాబాద్(Hyderabad), జైపూర్(Jaipur), భువనేశ్వర్( Bhubaneswar) వంటి నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలతో డెలివరీ రవాణాను నిర్వహిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్టు కళ్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ డెలివరీ కోసం ఎలక్ట్రిక్ వాహనాల రూపకల్పన, తయారీకి సహకరించనుంది. గతేడాది కంపెనీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Plastic)ను 25 శాతం తగ్గించినట్టు, 2021 మార్చి నాటికి తన సొంత సరఫరా వ్యవస్థలో 100 శాతం రీసైకిల్ ప్లాస్టిక్ వినియోగం సాధించేందుకు సిద్ధంగా ఉందని కంపెనీ వెల్లడించింది.