వారోత్సవాల వేళ మావోయిస్టులకు ఎదురుదెబ్బ

దిశ, భద్రాచలం (చర్ల): పీఎల్‌జీఏ 21వ వార్షికోత్సవ వారోత్సవాల ప్రారంభం రోజున మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండెవాయి గ్రామానికి చెందిన ముగ్గురు గ్రామ కమిటీ సభ్యులు, ఇద్దరు మిలీషియా సభ్యులు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ సమక్షంలో లొంగిపోయారు. మావోయిస్టు గ్రామ కమిటీ సభ్యులు దూది గంగా (40), పొడియం ఎడమయ్య (33), మూసిక కోశయ్య (28), మిలీషియా సభ్యులు పొడియం రాజే (18), సోడి గంగి […]

Update: 2021-12-02 04:53 GMT

దిశ, భద్రాచలం (చర్ల): పీఎల్‌జీఏ 21వ వార్షికోత్సవ వారోత్సవాల ప్రారంభం రోజున మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండెవాయి గ్రామానికి చెందిన ముగ్గురు గ్రామ కమిటీ సభ్యులు, ఇద్దరు మిలీషియా సభ్యులు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ సమక్షంలో లొంగిపోయారు. మావోయిస్టు గ్రామ కమిటీ సభ్యులు దూది గంగా (40), పొడియం ఎడమయ్య (33), మూసిక కోశయ్య (28), మిలీషియా సభ్యులు పొడియం రాజే (18), సోడి గంగి (18) లొంగిపోయిన వారిలో ఉన్నారు. చర్ల ఎల్‌వోఎస్ ఆధ్వర్యంలో వీరు పనిచేసినట్లుగా తెలిపారు. వీరి మార్గంలోనే మరికొందరు మావోయిస్టులు లొంగిపోవాలని ఎస్పీ సునీల్‌దత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్ డీఎస్పీ కమల్‌వీర్ యాదవ్, భద్రాచలం ఏఎస్పీ ఆక్షాన్స్ యాదవ్, ఓఎస్డీ తిరుపతి, చర్ల సీఐ బి. అశోక్, ఎస్సైలు రాజువర్మ, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News