41 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు రికార్డు

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. గత మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లలో ఆరుగురిని తప్పించి మూడో వన్డే ఆడిస్తున్నది. కాగా, ఇందులో ఐదుగురు క్రికెటర్లు అరంగేట్రం చేస్తుండటం విశేషం. 41 ఏళ్ల తర్వాత ఒకే మ్యాచ్‌లో ఐదుగురు క్రికెటర్లు భారత జట్టు తరపున అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి. టీమ్ ఇండియా తరపున వన్డేల్లో సంజూ శాంసన్. నితీశ్ రాణా, చేతన్ సకారియా. క్రిష్ణప్ప గౌతమ్. రాహుల్ చాహర్ అరంగేట్రం […]

Update: 2021-07-23 08:11 GMT

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. గత మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లలో ఆరుగురిని తప్పించి మూడో వన్డే ఆడిస్తున్నది. కాగా, ఇందులో ఐదుగురు క్రికెటర్లు అరంగేట్రం చేస్తుండటం విశేషం. 41 ఏళ్ల తర్వాత ఒకే మ్యాచ్‌లో ఐదుగురు క్రికెటర్లు భారత జట్టు తరపున అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి. టీమ్ ఇండియా తరపున వన్డేల్లో సంజూ శాంసన్. నితీశ్ రాణా, చేతన్ సకారియా. క్రిష్ణప్ప గౌతమ్. రాహుల్ చాహర్ అరంగేట్రం చేశారు.

భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతిని ఇచ్చి నవదీప్ సైనీని తీసుకున్నారు. 1980లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐదుగురు క్రికెటర్లు అరంగేట్రం చేశారు. దిలీప్ జోషి, కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, సందీప్ పాటిల్, తిరుమలై శ్రీనివాసన్ ఒకే సారి అరంగేట్రం చేశారు. తిరిగి 41 ఏళ్ల తర్వాత అంత మంది ఒకే సారి వన్డేల్లో భారత జట్టు తరపున తొలి మ్యాచ్ ఆడుతున్నారు. కాగా, ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలవడం గమనార్హం.

Tags:    

Similar News