ఎన్నికల తర్వాతే జమ్మూకు రాష్ట్ర హోదా!

దిశ, న్యూఢిల్లీ: జమ్మూలో ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా పునరుద్దరణ చేయవచ్చని కేంద్ర హోం‌మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం జరిగిన నాయకత్వ సదస్సులో ఆయన ప్రసంగించారు. రాజకీయ లబ్ధి కోసమే జమ్మూ అంశంపై వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ‘జమ్ముకశ్మీర్‌లో మొదట రాష్ట్రహోదా కల్పించి తర్వాత ఎన్నికలు జరపాలనే రాజకీయ డిమాండ్ ఉంది. పార్లమెంటు ఈ ప్రాంతంలో నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని జారీ చేసింది. ముందు పునర్విభజన జరిగిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాతే రాష్ట్ర […]

Update: 2021-12-04 06:42 GMT

దిశ, న్యూఢిల్లీ: జమ్మూలో ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా పునరుద్దరణ చేయవచ్చని కేంద్ర హోం‌మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం జరిగిన నాయకత్వ సదస్సులో ఆయన ప్రసంగించారు. రాజకీయ లబ్ధి కోసమే జమ్మూ అంశంపై వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ‘జమ్ముకశ్మీర్‌లో మొదట రాష్ట్రహోదా కల్పించి తర్వాత ఎన్నికలు జరపాలనే రాజకీయ డిమాండ్ ఉంది. పార్లమెంటు ఈ ప్రాంతంలో నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని జారీ చేసింది. ముందు పునర్విభజన జరిగిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాతే రాష్ట్ర హోదా పునరుద్దరణ ప్రక్రియ ప్రారంభం కావచ్చు. నేను ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెప్పాను. కానీ కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాన్ని సృష్టిస్తున్నారు’ అని తెలిపారు. అయితే ప్రస్తుతం కశ్మీర్‌లో పర్యాటక వాతవరణం పెరిగిందన్నారు. లోయ ప్రాంత ప్రజలు ఈ మార్పును స్వాగతిస్తారని తెలిపారు. పంజాబ్ ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా కెప్టెన్ అమరీందర్ సింగ్, శిరోమణి అకాళీదళ్ లీడర్ సుఖ్‌దేవ్ సింగ్ ధిండాతో పొత్తుపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. కూటమిగా ఏర్పడటానికి అవకాశం ఉందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై పూర్తి స్థాయిలో సమాచారం లేదన్నారు. అయితే రెండో డోసు తీసుకొని వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News