నీటిలో తేలియాడే త్రీడీ ప్రింటెడ్ ఇల్లు
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీలో రోజుకొక అద్భుతం చోటు చేసుకుంటోంది. ఇప్పటి వరకు మానవ అంగాలు, పెద్ద పెద్ద పరికరాలు, శిల్పాలు, ఇంకా ఇతర వస్తువులను ప్రింట్ చేశారు. కానీ చెక్ రిపబ్లిక్ దేశంలో ఇప్పుడు ఏకంగా ఒక ఇల్లునే ప్రింట్ చేశారు. ఇది త్రీడీ ప్రింటింగ్ ఇల్లు మాత్రమే కాదు, నీటిలో తేలియాడే ఇల్లు కూడా. అక్కడి ‘స్టేవ్‌బ్నీ స్పోరిటెల్నా సెస్కే స్పోరిటెల్నీ బిల్డింగ్ సొసైటీ’ వారి సౌజన్యంతో మైకేల్ ట్రాపాక్ అనే డిజైనర్ ఈ స్టైలిష్ […]
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీలో రోజుకొక అద్భుతం చోటు చేసుకుంటోంది. ఇప్పటి వరకు మానవ అంగాలు, పెద్ద పెద్ద పరికరాలు, శిల్పాలు, ఇంకా ఇతర వస్తువులను ప్రింట్ చేశారు. కానీ చెక్ రిపబ్లిక్ దేశంలో ఇప్పుడు ఏకంగా ఒక ఇల్లునే ప్రింట్ చేశారు. ఇది త్రీడీ ప్రింటింగ్ ఇల్లు మాత్రమే కాదు, నీటిలో తేలియాడే ఇల్లు కూడా. అక్కడి ‘స్టేవ్‌బ్నీ స్పోరిటెల్నా సెస్కే స్పోరిటెల్నీ బిల్డింగ్ సొసైటీ’ వారి సౌజన్యంతో మైకేల్ ట్రాపాక్ అనే డిజైనర్ ఈ స్టైలిష్ త్రీడీ ఇల్లును డిజైన్ చేశారు. ఇలా త్రీడీ ప్రింటింగ్ ద్వారా ఇల్లు నిర్మించడం వల్ల పర్యావరణ సుస్థిరాభివృద్ధి కూడా నిలకడగా ఉండే అవకాశం కలుగుతుందని మైకేల్ అంటున్నారు.
ఈ త్రీడీ ప్రింట్ ఇంటికి ప్రొవోక్ ఒడ్ బురింకీ (ప్రోటోజూన్) అని పేరు పెట్టారు. జూన్‌లో దీన్ని నిర్మించారు. 43 చదరపు అడుగుల వైశాల్యం గల ఈ ఇంట్లో కిచెన్, లివింగ్ రూమ్, బెడ్ రూమ్‌తో పాటు ఒక బాత్రూమ్ కూడా ఇందులో ఉంది. స్వయంగా సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసుకోగల ఈ ఇంట్లో సంవత్సరం పాటు ఎలాంటి ఢోకా లేకుండా నివసించవచ్చు. సాధారణ కాంక్రీటు కంటే దీని షెల్ మూడు రెట్లు గట్టిగా ఉంటుంది. త్రీడీ ప్రింటింగ్ ఇంటిని నిర్మించడానికి 48 గంటలు పడుతుంది. కానీ అది నివసించడానికి వీలుగా మారడానికి కనీసం రెండు నెలలు పడుతుందని మైకేల్ అన్నారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఇది తట్టుకుని కనీసం వందేళ్ల పాటు నిలబడగలుగుతుందని మైకేల్ వెల్లడించారు. ఇళ్లను త్రీడీ ప్రింట్ చేయడం ద్వారా సమయంతో పాటు వనరులు కూడా మిగులుతాయని, అంతేకాకుండా వీలైనట్లుగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని స్పోరిటెల్నీ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు.