నల్లమలలో అదుపులోకి మంటలు..

దిశ, అచ్చంపేట : వేసవి కాలం వచ్చిందంటే నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కడో ఒక మూలన అగ్ని ప్రమాదం చోటుచేసుకుంటుంది. ఈ క్రమంలో అడవిలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు అటవీశాఖ అధికారులు నానా తంటాలు పడుతుంటారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలోని తుర్కపల్లి గ్రామం సమీపంలో ఈర్ల పడెలు అటవీ ప్రాంతంలో సుమారు 50 హెక్టార్లలో అడవి అగ్నికి ఆహుతి అయినది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అటవీశాఖ అధికారులు […]

Update: 2021-03-19 10:43 GMT

దిశ, అచ్చంపేట : వేసవి కాలం వచ్చిందంటే నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కడో ఒక మూలన అగ్ని ప్రమాదం చోటుచేసుకుంటుంది. ఈ క్రమంలో అడవిలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు అటవీశాఖ అధికారులు నానా తంటాలు పడుతుంటారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలోని తుర్కపల్లి గ్రామం సమీపంలో ఈర్ల పడెలు అటవీ ప్రాంతంలో సుమారు 50 హెక్టార్లలో అడవి అగ్నికి ఆహుతి అయినది.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక అటవీశాఖ అధికారులు హుటాహుటిన అటవీ అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో బేస్ క్యాంప్, 30 మంది సిబ్బందితో కలిసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు.

దీంతో దగ్గరంలో ఉన్న ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించి వారి సహకారంతో మంటలను అదుపు చేసినట్టు అటవీశాఖ అధికారి ప్రభాకర్ తెలిపారు. సుమారు మూడు గంటలపాటు ఫైర్ ఇంజన్ సహకారంతో మా సిబ్బంది శ్రమించి మంటలను అదుపు చేసినట్టు తెలిపారు.

 

Tags:    

Similar News