ఆరేళ్ల చిన్నారి.. 2 గంటలు 2 గోడల మధ్య..
దిశ, వెబ్ డెస్క్: బొమ్మ కోసం వెళ్లిన చిన్నారి రెండు గంటల పాటు రెండు గోడల ఇరుక్కుని నరకయాతన అనుభవించింది. ఈ ఘటన ఒంగోలు జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మీనాక్షి అనే ఆరేండ్ల చిన్నారి ఆడుకుంటుండగా, చేతిలో ఉన్న బొమ్మ గోడల మధ్యలో పడిపోయింది. అయితే బొమ్మను బయటకు తీసేందుకు ప్రయత్నించిన చిన్నారి మీనాక్షి కూడా, ఆ గోడల మధ్య ఇరుక్కుపోయింది. గోడలు […]
దిశ, వెబ్ డెస్క్: బొమ్మ కోసం వెళ్లిన చిన్నారి రెండు గంటల పాటు రెండు గోడల ఇరుక్కుని నరకయాతన అనుభవించింది. ఈ ఘటన ఒంగోలు జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మీనాక్షి అనే ఆరేండ్ల చిన్నారి ఆడుకుంటుండగా, చేతిలో ఉన్న బొమ్మ గోడల మధ్యలో పడిపోయింది. అయితే బొమ్మను బయటకు తీసేందుకు ప్రయత్నించిన చిన్నారి మీనాక్షి కూడా, ఆ గోడల మధ్య ఇరుక్కుపోయింది. గోడలు ఇరుగ్గా ఉండటంతో బయటకు రాలేక తల్లడిల్లిపోయింది. చిన్నారి ఏడుపు చప్పుడు విన్న స్థానికులు మీనాక్షిని బయటకు తీసేందుకు చాలాసేపు ప్రయత్నించినా, చివరకు విఫలం చెందారు. చివరకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి, రెండు గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు చిన్నారిని బయటకు తీశారు. దీంతో మీనాక్షి తల్లిదండ్రులు ఊపికి పీల్చుకున్నారు.