‘చైనా టెంట్ అంటుకోవడంతో ఘర్షణలు’
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా వేసుకున్న టెంటులో ఆకస్మికంగా మంటలు చెలరేగడం మూలంగా ఇరుదేశాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని హింసాత్మకంగా మారాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి వీకే సింగ్ అన్నారు. ఆ ఘటనలో 40మందికిపైనే చైనా జవాన్లు మరణించారని చెప్పారు. ఓ న్యూస్ చానెల్‌తో జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ మాట్లాడుతూ, ఎల్ఏసీ సమీపంలో ఇరుదేశాల సైన్యం ఉండరాదని కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లో(జూన్ 6) అంగీకారం కుదిరిందని, అయితే, జూన్ 15న చైనీస్ ఆర్మీ వెనక్కి […]
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా వేసుకున్న టెంటులో ఆకస్మికంగా మంటలు చెలరేగడం మూలంగా ఇరుదేశాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని హింసాత్మకంగా మారాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి వీకే సింగ్ అన్నారు. ఆ ఘటనలో 40మందికిపైనే చైనా జవాన్లు మరణించారని చెప్పారు. ఓ న్యూస్ చానెల్‌తో జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ మాట్లాడుతూ, ఎల్ఏసీ సమీపంలో ఇరుదేశాల సైన్యం ఉండరాదని కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లో(జూన్ 6) అంగీకారం కుదిరిందని, అయితే, జూన్ 15న చైనీస్ ఆర్మీ వెనక్కి తగ్గిందా? లేదా? పరిశీలించాలనే ఉద్దేశంతో ఎల్ఏసీ సమీపానికి భారత సైనికులు వెళ్లారని వివరించారు. అక్కడ చైనా సైన్యం ఇంకా ఉండటమే కాదు, టెంట్ కూడా వేసుకుందని భారత జవాన్లు గుర్తించారని తెలిపారు. టెంట్ తొలగించాలని భారత కమాండింగ్ అధికారి పొరుగుదేశ సైనికులను అడిగారని, అప్పుడు వారు టెంట్ తొలగిస్తుండగానే ఆకస్మికంగా మంటలు చెలరేగాయని, ఈ ఘటన తర్వాతే ఇరుదేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయని వివరించారు.