తెలంగాణలో మరో భారీ అగ్నిప్రమాదం

దిశ ప్రతినిధి, కరీంనగర్: శ్రీశైలం ఘటన మరవకముందే రాష్ట్రంలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిసిటీ క్యాంపస్ లోని స్పోర్ట్స్ సెంటర్ సమీపంలో మంటలు చెలరేగాయి. చెత్తా చెదారం పేరుకపోవడంతో చెత్తనంతా ఒక చోటకు చేర్చి నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హుటాహుటిన ఫైర్ ఇంజిన్లను ఘటనా స్థలానికి రప్పించి మంటలు ఆర్పే ప్రయత్నం […]

Update: 2020-08-28 23:51 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: శ్రీశైలం ఘటన మరవకముందే రాష్ట్రంలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిసిటీ క్యాంపస్ లోని స్పోర్ట్స్ సెంటర్ సమీపంలో మంటలు చెలరేగాయి. చెత్తా చెదారం పేరుకపోవడంతో చెత్తనంతా ఒక చోటకు చేర్చి నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హుటాహుటిన ఫైర్ ఇంజిన్లను ఘటనా స్థలానికి రప్పించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సబ్ స్టేషన్ కరీంనగర్, జగిత్యాల హైవేపై ఉంది. సమీపంలోనే నివాసలతోపాటు వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. ట్రాన్స్ కో అధికారులు, ఫైర్ డిపార్ట్ మెంట్ యంత్రాంగం మంటలను కట్టడి చేసే పనిలో నిమగ్నం అయ్యారు. మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ శశాంక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Tags:    

Similar News