పూనమ్ పాండేపై కేసు..
దిశ, వెబ్‌డెస్క్: కాంట్రవర్షియల్ స్టార్ అండ్ మోడల్ పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచింది. గోవా ప్రభుత్వ వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రాపర్టీలో పోర్న్ ఫొటో షూట్ చేయడంపై కేసు నమోదైంది. గోవా ఫార్వార్డ్ పార్టీ ఉమెన్ వింగ్ పోలీసులను ఆశ్రయించగా.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 294 కింద కేసు నమోదైనట్లు సౌత్ గోవా ఎస్పీ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారని.. మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదయ్యే […]
దిశ, వెబ్‌డెస్క్: కాంట్రవర్షియల్ స్టార్ అండ్ మోడల్ పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచింది. గోవా ప్రభుత్వ వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రాపర్టీలో పోర్న్ ఫొటో షూట్ చేయడంపై కేసు నమోదైంది. గోవా ఫార్వార్డ్ పార్టీ ఉమెన్ వింగ్ పోలీసులను ఆశ్రయించగా.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 294 కింద కేసు నమోదైనట్లు సౌత్ గోవా ఎస్పీ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారని.. మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదయ్యే అవకాశముందని చెప్పారు. ఈ విషయంపై గోవా ఫార్వార్డ్ పార్టీ వైస్ ప్రెసిడెంట్, స్పోక్స్ పర్సన్ దుర్గాదాస్ కమత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఫిలిపే నెరి రోడ్రిగేజ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాగా సామ్ బాంబేను పెళ్లి చేసుకున్న పదిరోజులకే పూనమ్ తనపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. గోవాలో షూటింగ్ సమయంలో అక్కడే భర్తతో స్టే చేసిన పూనమ్.. తనను శారీరకంగా వేధించాడని అతనిపై డొమెస్టిక్ వాయిలెన్స్ కేసు పెట్టి హెడ్ లైన్స్‌లో నిలిచింది.