కరోనా తీవ్రత తగ్గితేనే ఐపీఎల్‌పై ఆలోచిస్తాం : బీసీసీఐ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించడం, కొవిడ్ – 19 మహమ్మారి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండటంతో బీసీసీఐ ఐపీఎల్ రద్దుకే మొగ్గు చూపింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఐపీఎల్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే ఐపీఎల్‌పై పునరాలో చిస్తామని వెల్లడించింది. ‘ఐపీఎల్ ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, స్పాన్సర్లు, […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించడం, కొవిడ్ – 19 మహమ్మారి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండటంతో బీసీసీఐ ఐపీఎల్ రద్దుకే మొగ్గు చూపింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఐపీఎల్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే ఐపీఎల్‌పై పునరాలో చిస్తామని వెల్లడించింది. ‘ఐపీఎల్ ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్ల నుంచి ఒత్తిడి రావడంతో సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో ఐపీఎల్ నిర్వహించాలని అనుకున్నాం.. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనా నుంచి ఎటువంటి ముప్పులేదని ప్రకటన వస్తేనే ఐపీఎల్ జరుగుతుంది’ అని తేల్చి చెప్పింది. కాగా, రద్దు విషయాన్ని బీసీసీఐ మంగళవారమే అన్ని ఫ్రాంచైజీలకు చేరవేసింది.
మే-జూన్ దాటిన తర్వాత ఐపీఎల్ నిర్వహించేందుకు సమయం లేదని.. పలు దేశాల క్రీడాకారులు ఇతర టోర్నీలు, సిరీస్‌లతో బిజీగా ఉంటారని, అందుకే ఈ ఏడాదికి రద్దు చేయడమే సరైన నిర్ణయంగా భావిస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఐసీసీ భవిష్యత్ ప్రణాళిక (ఎఫ్‌టీపీ)ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేం.. కాబట్టి ఈ సమయం దాటిపోతే ఐపీఎల్ నిర్వహణ కష్టమేనని గతంలోనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడగా.. వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్, ఫుట్‌బాల్ లీగ్స్ అన్నీ వాయిదా పడ్డాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ వాయిదా వేశామని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
Tags : BCCI, IPL, Corona, Cancelled, Franchisees, Sourav Ganguly, ICC