త్రిష.. ఓ చిత్‘రాంగి’!
త్రిష… స్మైలింగ్ క్వీన్. చిన్న చిరునవ్వుతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. ‘వర్షం’తో దోబూచులాడి కుర్రకారును మైమరిపించింది. దాదాపు 20 ఏళ్లుగా తన నటనతో ప్రేక్షకులను మాయ చేస్తోంది. నాలుగు పదుల వయస్సుకు చేరువవుతున్నా… అందం, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా వరుస అవకాశాలు ఆమె ముంగిట నిలుస్తున్నాయి. అందుకు ఆమె సత్ప్రవర్తనే కారణమంటారు ఫిల్మ్ మేకర్స్. సినిమాపై ఆమెకున్న అభిమానం, ప్రేమే ఇందుకు తార్కాణం అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా ఓ […]
త్రిష… స్మైలింగ్ క్వీన్. చిన్న చిరునవ్వుతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. ‘వర్షం’తో దోబూచులాడి కుర్రకారును మైమరిపించింది. దాదాపు 20 ఏళ్లుగా తన నటనతో ప్రేక్షకులను మాయ చేస్తోంది. నాలుగు పదుల వయస్సుకు చేరువవుతున్నా… అందం, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా వరుస అవకాశాలు ఆమె ముంగిట నిలుస్తున్నాయి. అందుకు ఆమె సత్ప్రవర్తనే కారణమంటారు ఫిల్మ్ మేకర్స్. సినిమాపై ఆమెకున్న అభిమానం, ప్రేమే ఇందుకు తార్కాణం అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా ఓ విషయాన్ని షేర్ చేసింది ‘రాంగి’ చిత్ర యూనిట్.
శరవణన్ దర్శకత్వంలో వస్తున్న రాంగి చిత్రానికి ఏఆర్ మురుగదాస్ కథ, మాటలు అందించారు. త్రిష లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ఉజ్బెకిస్థాన్‌లో జరిగిందట. రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో అత్యంత చలి వాతావరణంలోనూ త్రిష నటించిందట. ఉదయాన్నే షూటింగ్ ఉన్నా టైంకి వచ్చేసేదని, అందువల్లే సక్సెస్‌ఫుల్‌గా షూటింగ్ అనుకున్న సమయానికి కంప్లీట్ చేశామని చిత్ర యూనిట్ చెప్పింది. దీంతో త్రిష డెడికేషన్ లెవల్స్‌కు దర్శక, నిర్మాతలు సలాం చెప్పారు. ’96’ సినిమాతో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేసిన త్రిష… ఇప్పుడు ‘రాంగి’ సినిమాలో ఫైట్స్‌తో అదరగొట్టనుందట. మణిరత్నం భారీ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ క్రేజీ రోల్ చేస్తున్న త్రిష.. పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘పరమపద విళయాట్టు’ రిలీజ్‌కు రెడీ అయింది. ఇది త్రిషకు 60వ సినిమా కావడం విశేషం.