'నిబంధనలు ఉల్లంఘించలేదు'

దిశ, స్పోర్ట్స్ : ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ (ఎఫ్ఐహెచ్)కు 2016 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు నరీందర్ ధృవ్ బాత్రా ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఐహెచ్ఎఫ్) నిబంధనలు ఉల్లంఘించలేదని ఎఫ్ఐయూ చైర్మన్ వాన్ నెల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆనాటి ఎన్నికల్లో నరీందర్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశాడని, అతడిని అనర్హుడిగా ప్రకటించాలని ఎఫ్ఐహెచ్ ఉపాధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ పిర్యాదు చేశారు. జూన్ 8న ఎఫ్ఐహెచ్ క్రమశిక్షణ కమిషనర్ గోర్డన్ నర్స్‌కు ఈ పిర్యాదు […]

Update: 2020-06-12 07:31 GMT

దిశ, స్పోర్ట్స్ : ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ (ఎఫ్ఐహెచ్)కు 2016 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు నరీందర్ ధృవ్ బాత్రా ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఐహెచ్ఎఫ్) నిబంధనలు ఉల్లంఘించలేదని ఎఫ్ఐయూ చైర్మన్ వాన్ నెల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆనాటి ఎన్నికల్లో నరీందర్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశాడని, అతడిని అనర్హుడిగా ప్రకటించాలని ఎఫ్ఐహెచ్ ఉపాధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ పిర్యాదు చేశారు. జూన్ 8న ఎఫ్ఐహెచ్ క్రమశిక్షణ కమిషనర్ గోర్డన్ నర్స్‌కు ఈ పిర్యాదు అందింది. వెంటనే దీనిపై ఎఫ్ఐహెచ్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఎఫ్ఐయూ) దర్యాప్తు చేసిన అనంతరం.. ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పింది. ప్రస్తుతం హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగానే కాకుండా ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా నరీందర్ కొనసాగుతున్నారు. ఉపాధ్యక్షుడు మిట్టల్.. ఇదే విషయాన్ని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీకి కూడా పిర్యాదు చేశారు.

Tags:    

Similar News